Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికీ తెల్సిందే. ఆయనకు తెల్సినవి రెండే రెండు. ఒకటి సినిమా.. రెండు కుటుంబం. అయితే షూటింగ్స్.. లేకపోతే వెకేషన్స్. ఇంతకు మించి మహేష్ ఎక్కడా కూడా పెద్దగా కనిపించడు కూడా. ఇక బయట ఎక్కడ కనిపించకపోయినా .. సోషల్ మీడియాలో మాత్రం మహేష్ ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాడు. ఏ సినిమా అయినా రిలీజ్ అయ్యిందా.. ? అది ఓటీటీనా.. ? థియేటరా.. ? అనేది కూడా చూడడు. సినిమా నచ్చింది అంటే.. ఎక్స్ లో పోస్ట్ పెట్టడమే.
ఇక మహేష్ కు కుటుంబం అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా నేడు మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమా రిలీజ్ అయిన విషయం తెల్సిందే. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అశోక్ సరసన మానస వారణాసి నటించింది. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథను అందించడం విశేషం.
Sreeleela: అందం అమ్మాయైతే.. నీలా ఉందా అన్నట్టుందే
మొదటి నుంచి కూడా దేవకీ నందన వాసుదేవకు మంచి హైప్ వచ్చింది. అందులో కూడా.. మహేష్ ఈ చిత్రంలో శ్రీకృష్ణుడు పాత్రలో కనిపిస్తున్నాడు అని తెలియడంతో.. ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయ్యింది. చివరి క్లైమాక్స్ షాట్ లో మహేష్ శ్రీకృష్ణ అవతారంలో కనిపిస్తాడు అనగానే .. ఫ్యాన్స్ అందరూ అమ్మ బాబోయ్.. ఇక కొత్త దేవుడు వచ్చేశాడు అంటూ సంబరపడిపోయారు.
Game Changer: ట్రైలర్ లక్నోలో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో.. అదిరిందయ్యా
అయితే ఆ సంబరం కొద్దీ రోజులు కూడా లేకుండానే అశోక గల్లా.. ఈ విషయమై స్పందించాడు. తమ సినిమాలో మహేష్ మామ లేడని, ఒకవేళ అలంటిది ఏదైనా జరిగితే తానే ముందు అందరికీ చెప్తానని చెప్పుకొచ్చాడు. దీంతో ఉత్సాహంతో ఊగిపోయిన ఫ్యాన్స్ ఊసురుమన్నారు. ఇక అలా హైప్ తెచ్చుకున్న దేవకీ నందన వాసుదేవ నేడు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లు సమాచారం.
Nayanthara: నయన్ కు ఇంతకుమించిన అవమానం ఇంకొకటి లేనట్టే.. అసలేం జరిగిందంటే.. ?
ఇక తాజాగా ఈ సినిమాపై మహేష్ ట్వీట్ చేయడం మరింత ఆసక్తిని పెంచుతుంది. ” దేవకీ నందన వాసుదేవ.. అశోక్ గల్లా ఏమి ట్రాన్స్ఫర్మేషన్.. నిన్ను చూసి నేను చాలా చాలా గర్వపడుతున్నాను. చిత్రబృందానికి శుభాకాంక్షలు ” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే మహేష్ సినిమా చూసి ఈ రివ్యూ ఇచ్చాడా.. ? లేక పాజిటివ్ టాక్ విని.. ఈ పోస్ట్ పెట్టాడా.. ? ఎలియాక ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి ఈ సినిమా ముందు ముందు ఎన్ని కలక్షన్స్ రాబడుతుందో చూడాలి.
#DevakiNandanaVasudeva @AshokGalla_ what a transformation!! So so proud ♥️♥️♥️ Congratulations to the entire team!! @ArjunJandyala @varanasi_manasa @PrasanthVarma #BheemsCeciroleo @saimadhav_burra @lalithambikaoff
— Mahesh Babu (@urstrulyMahesh) November 22, 2024