BigTV English

Citadel Honey Bunny: ‘సిటాడెల్’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న సామ్

Citadel Honey Bunny: ‘సిటాడెల్’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న సామ్

Citadel Honey Bunny Trailer : కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ అంతటా ఒక్కటే హాట్ టాపిక్ నడిచింది. అదే నాగార్జున, నాగచైతన్య, సమంతపై కాంగ్రెస్ లీడర్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు. దానిపై సెలబ్రిటీల రియాక్షన్స్ కూడా టాక్ ఆఫ్ ది టౌనే. కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ కొండా సురేఖ వ్యాఖ్యలు చేయగా అవి నాగార్జున కుటుంబానికి పరువునష్టం కలిగించేలా ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారంపై చట్టపరంగా పోరాడాలని నాగార్జున నిర్ణయించుకున్నారు. కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. ఒకవైపు కోర్టులో ఈ రచ్చ జరుగుతున్న సమయంలోనే తన వెబ్ సిరీస్ ‘సిటాడెల్ హనీ బన్నీ’ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకుంది సామ్. దీంతో ఈ సిరీస్‌పై ఆటోమేటిక్‌గా హైప్ పెరగనుంది.


దర్శకులతో ఫ్రెండ్‌షిప్

సమంత (Samantha).. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో నటించడానికి సిద్ధమయ్యింది. పైగా అందులో విలన్‌గా నటించి అందరికీ షాకిచ్చింది. డీ గ్లామర్ రోల్, విలన్ క్యారెక్టర్.. ఇవన్నీ సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా విలన్‌గా కూడా సమంత ఇచ్చిపడేసిందని ఫ్యాన్స్ ప్రశంసించారు. రాజ్ అండ్ డీకే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’కు దర్శకులుగా వ్యవహరించారు. ఆ సిరీస్ తర్వాత నుండి ఈ దర్శకురాలితో సమంతకు మంచి ఫ్రెండ్‌షిప్ కుదిరింది. అందుకే వారితో మరో సిరీస్ చేయడానికి ఒప్పుకుంది. అదే ‘సిటాడెల్ హనీ బన్నీ’ (Citadel Honey Bunny).


Also Read: సంపాదించింది మొత్తం అందుకు ఖర్చు పెడుతున్న సామ్.. రిస్క్ తట్టుకుంటుందా.. ?

యాక్షన్ సీన్స్ అదుర్స్

‘సిటాడెల్ హనీ బన్నీ’ ఒక యాక్షన్ సిరీస్. ఇందులో సమంతకు జోడీగా వరుణ్ ధావన్ నటించాడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అందుకే కొన్నాళ్ల క్రితం ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అందులో వరుణ్ ధావన్‌తో కలిసి సమంత చేసిన యాక్షన్ సీన్స్‌కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇక ఇప్పుడు ‘సిటాడెల్ హనీ బన్నీ’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ 15న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఒక స్పెషల్ పోస్ట్‌తో స్వయంగా ప్రకటించింది సమంత.

కొన్ని గంటల్లోనే

మయాసైటీస్ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది సమంత. ఇక తనను వెండితెరపై చూడడం కూడా కష్టమే అనుకుంటున్న సమయంలో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఆ మూవీ యావరేజ్ హిట్‌గా నిలిచింది. అంతలోనే ‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్ అప్డేట్‌తో అలరించింది. అప్పటినుండి అసలు ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుందా, అందులో సమంతను ఎప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా నవంబర్ 7న ‘సిటాడెల్ హనీ బన్నీ’ రిలీజ్‌కు డేట్ లాక్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ఇక దీని ట్రైలర్‌ విడుదలకు ఇంకా కొన్ని గంటలే సమయం ఉండగా ఫ్యాన్స్ అంతా దీనికోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×