Subham Pre Release Event:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఒకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే.. మరొకవైపు ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే బ్యానర్ ను స్థాపించి ‘శుభం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేయగా.. నిన్న ‘జన్మజన్మల బంధం’ అనే పాటను కూడా విడుదల చేశారు. రెండింటికీ కూడా ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఇకపోతే సమంత ఇందులో తొలిసారి దెయ్యాలను విడిపించి, మగవారికి న్యాయం చేయబోయే మాతాజీ పాత్రలో కనిపించబోతోంది. ఇకపోతే మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పంచుకుంది.
ఘనంగా సమంత శుభం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈరోజు (మే 4) సాయంత్రం 5:00 గంటలకు వైజాగ్ లోని ఆర్కే బీచ్ దగ్గర గోకుల్ పార్క్ ఎదురుగా ఉన్న నోవాటెల్ హోటల్లో ఘనంగా జరగబోతోంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఫ్రీగా ఎంట్రీ ఇవ్వడానికి పాస్ కావాలి అంటే www.shreyasgroup.net వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని సమంత వెల్లడించింది. ఇకపోతే పాస్ కొనుగోలు చేసిన వారికి సమంతను కలిసే అవకాశం కూడా ఉంటుందని సమాచారం. ఇకపోతే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సమంతతో పాటు సినిమా నటీనటులు కూడా హాజరు కాబోతున్నారు. మరి ఈ కార్యక్రమంలో సమంత వ్యక్తిగత జీవితంపై స్పందిస్తుందేమో చూడాలని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
శుభం మూవీ విశేషాలు..
సమంత స్థాపించిన నిర్మాణ సంస్థ ద్వారా రాబోతున్న తొలి చిత్రం “శుభం.. చచ్చిన చూడాల్సిందే” అనే టాగ్లైన్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ మరిగంటి కథను అందించారు. హార్రర్ కామెడీ మూవీ గా రాబోతున్న ఈ సినిమాలో సమంత మాతాజీ పాత్రలో నటిస్తూ ఉండగా.. హర్షిత్ రెడ్డి, శ్రియ కొంతం, చరణ్ పెరి, శాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఒక చిన్న సినిమాగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
also read:Big TV Kissik Talks: నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఆయనే – బాబు మోహన్..!
సమంత సినిమాలు..
మయోసైటిస్ వ్యాధి బారిన పడి చికిత్స కోసం ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈమె ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు మళ్లీ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అంతేకాదు తెలుగులో ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాపై ఎటువంటి అప్డేట్ వదలకపోవడం గమనార్హం.