BigTV English

Samantha: పోరాడండి.. బ‌లంగా త‌యార‌వుతారు.. స‌మంత ఎమోష‌న‌ల్ రిప్లై

Samantha: పోరాడండి.. బ‌లంగా త‌యార‌వుతారు.. స‌మంత ఎమోష‌న‌ల్ రిప్లై

Samantha:స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం మియో సైటిస్‌తో పోరాడుతున్నారు. సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్న ఆమె.. త్వ‌ర‌లోనే పూర్తి ఆరోగ్యంతో సినిమాల్లో బిజీగా మార‌బోతున్నారు. ఈ విష‌యాన్ని సామ్ మ‌రోసారి త‌న ఇన్‌స్పిరేష‌న‌ల్ మెసేజ్ ద్వారా తెలియ‌జేసింది. అస‌లు విష‌యంలోకి వెళితే.. న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన రాహుల్ ర‌వీంద్ర‌న్.. స‌మంత‌కు చాలా మంచి స్నేహితుడు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా త‌ను ఓ స్ఫూర్తిదాయ‌క‌మైన మెసేజ్‌ను పంప‌టం ద్వారా స‌మంత‌కు గిఫ్ట్‌ను ఇచ్చారు. ఇంత‌కీ రాహుల్ ర‌వీంద్ర‌న్ ఏమ‌న్నారనే వివ‌రాల్లోకి వెళితే..


‘ప్ర‌స్తుతం నువ్వు ప్ర‌యాణిస్తున్న దారి చీక‌టిగా ఉండొచ్చు. కానీ త్వ‌ర‌లోనే అది ప్ర‌కాశిస్తుంది. నీ శ‌రీరంలో క‌ద‌లిక‌లు కూడా క‌ష్టంగా ఉండ‌వ‌చ్చు. కానీ అవ‌న్నీ త్వ‌ర‌లోనే స‌మ‌సిపోతాయి. ఎందుకంటే నువ్వు ఉక్కు మ‌హిళ‌వి.. యోధురాలివి. పోరాటం నీ జ‌న్మ హ‌క్కు. నిన్ను ఏదీ ఓడించ‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల ఎదురు కావ‌టం వ‌ల్ల‌.. నువ్వింకా బ‌లంగా మారుతావు’ అని మెసేజ్ షేర్ చేశారు రాహుల్ ర‌వీంద్ర‌న్‌. త‌న ఫ్రెండ్ పోస్ట్ చేసిన మెసేజ్‌కు స‌మంత కూడా రియాక్ట్ అయ్యింది. ‘క‌ఠిన‌మైన యుద్ధాలు చేసే వారికి ఇది అంకితం. పోరాడండి గ‌తంలో కంటే బ‌లంగా త‌యార‌వుతారు’ అని అన్నారు సామ్‌.

ఈ ఏడాదిలో య‌శోద అనే పాన్ ఇండియా సినిమాతో స‌క్సెస్ సాధించిన స‌మంత‌.. వ‌చ్చే ఏడాదిలో శాకుంత‌లం అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులున్నాయి. మేకర్స్ ఆమె కోసం ఎదురు చూస్తున్నారు.


Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×