India-Pakistan War: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ దాయాది కీలక నిర్ణయం తీసుకుంది. తన తన గగనతలాన్ని మూసేస్తున్నట్టు ప్రకటిస్తూ నోటమ్ జారీ చేసింది. మద్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్నేషనల్, డొమెస్టిక్ విమానాలకు ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది. అబుదాబి నుంచి పెషావర్ వెళ్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానాన్ని క్వెట్టాకు డైవర్ట్ చేశారని అక్కడి అధికారులు. నిన్న రాత్రి భారత్ చేసిన ప్రతి దాడుల్లో పాక్ ఎయిర్ బేస్‌ల్లోని అన్ని సౌకర్యాలు ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. పాక్ ఫైటర్ జెట్స్ కూడా ఎగిరే పరిస్థితి లేకుండా పోయింది.
పౌర విమానాలను రక్షణగా చేసుకొని పాక్ డ్రోన్ డాడులు చేస్తోందని భారత్ ఆరోపించిన కొన్ని గంటల్లోనే దాయాది గగనతలాన్ని మూసివేసింది. గురువారం, శుక్రవారం రాత్రి భారత్ లోని సరిహద్దు నగరాలనే టార్గెట్ చేస్తూ పాక్ డ్రోన్ దాడులు చేసింది. కానీ.. పాక్ ప్రయత్నాలను ఎక్కడిక్కడ అడ్డుకుంటోంది మన సైన్యం. అయితే.. నిన్న రాత్రి డ్రోన్ దాడి జరుగుతున్న సమయంలో ఐబీ, ఎల్ఓసీ సమీపంలో దాదాపుగా 100 కంటే ఎక్కువ పౌర విమానాలు ప్రయాణిస్తున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ద్వారా తెలుస్తోంది.
పాక్ డ్రోన్ దాడులను చేసిన సమయంలో లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ విమానాశ్రయాల్లో పదుల సంఖ్యలో ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఫ్లైట్స్ ల్యాండింగ్, టేకాఫ్ అయ్యాయి. సో.. పాక్ డ్రోన్లను అడ్డుకునే ప్రయత్నంలో మనం దాడి చేస్తే సామాన్యులపై కూడా భారత్ దాడి చేస్తుందని ఆరోపించాలని దాయాది ప్లాన్. అయితే… పాక్ బుద్ధిని ముందుగానే పసిగట్టిన భారత్… కుట్రను భగ్నం చేసింది. పౌరవిమానాలను అడ్డుపెట్టుకొని దాడులు చేస్తుందన్న విషయాన్ని ప్రపంచానికి చూపించాం. దీంతో చేసేదేమీ లేక.. గగనతలాన్ని మూసివేసింది పాక్.
పాక్ ఉద్రిక్తతలతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మే 15 వరకు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టులు మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 32 విమానాశ్రయాలు మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఉత్తర, పశ్చిమ భారత్‌లోని విమానాశ్రయాలు నిర్ధారించాలని నిర్ణయం తీసుకుంది.
మరో వైపు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, సిబ్బంది, ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య కారణాలు మినహాయించబడ్డాయి.. ఏ ఒక్కరికీ సెలవులు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారి సెలవులను రద్దు చేస్తూ వెంటనే విధుల్లో చేరాలని.
Also Read: పాక్ లో అంతర్యుద్ధం? సైన్యం తిరుగుబాటు? పాకిస్తాన్ షట్టర్ క్లోజ్
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఒకవైపు భారత్‌పై డ్రోన్, మిసైల్ దాడులతో గందరగోళంలో ఉంటే, మరోవైపు బలూచిస్తాన్‌లో తిరుగుబాటుదారులు పాక్ సైన్యంపై దాడులను ముమ్మరం చేశారు. బలూచ్ యోధులు పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్ లో పలు ప్రాంతాల్లో BLA జెండాలను ఊపుతున్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బలూచ్ యోధులు మూడు సమూహాలుగా విడిపోయి, పాకిస్తాన్‌లోని పశ్చిమ ప్రాంతమైన బలూచిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. బలూచ్ తిరుగుబాటు గ్రూపులు, పాక్ సైన్యం మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుదారులు కేచ్, మస్తుంగ్, కచ్చి ప్రాంతాల్లో పాక్ సైన్యం, వారి సహకారులపై ఆరు వేర్వేరు దాడులు చేశారని రేడియో సంస్థ వెల్లడించింది.