Hyderabad Weather Update: హైదరాబాద్ నగరం వాతావరణం ఇక ముందు కాస్త చల్లన, మరికాస్త ఎండన అనే రీతిలో ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని, ముందస్తు జాగ్రత్తలు అవసరమని వారి అభిప్రాయం. నగరంలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రానికి సమ్మర్ సీజన్ ముందే పలకరించింది. ఎండలు దంచికొట్టడం అటుంచితే, అప్పటికప్పుడు వాతావరణం మారి వర్షాలు కురిసిన రోజులు కూడా ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అయితే పూర్తి భిన్నంగా వాతావరణం సాగిందని చెప్పవచ్చు. కొద్ది రోజులు హీటెక్కించే ఎండలు ప్రజలను బెదరగొట్టగా, అదే రీతిలో వర్షాలు కూడా నగరవాసులను ఉరుములు, మెరుపులతో భయపెట్టాయని చెప్పవచ్చు.
ప్రస్తుతం మే నెలలో మాత్రం నగరంలో వాతావరణం మరింత భిన్నంగా ఉండనుంది. ఈ నెలలో హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. ఈరోజు మాత్రం గరిష్ఠ ఉష్ణోగ్రత 38°C వరకు చేరుకోనుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 25°C నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే కొన్ని రోజులలో కూడా ఇదే తరహా ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి.
రాబోయే వాతావరణ పరిస్థితులు..
మే 11న గరిష్ఠ ఉష్ణోగ్రత 38°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 25°C నమోదు కానుండగా, వాతావరణం సన్నగా మేఘావృతం కావచ్చు. మే 12న గరిష్ఠ ఉష్ణోగ్రత 38°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 25°C నమోదు, వాతావరణం సన్నగా మేఘావృతం కావచ్చు. మే 13న గరిష్ఠ ఉష్ణోగ్రత 37°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 25°C కాగా, మధ్యాహ్నం సమయంలో కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములు సంభవించవచ్చు. మే 14న గరిష్ఠ ఉష్ణోగ్రత 35°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 25°C నమోదు కానుండగా, మధ్యాహ్నం సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు సంభవించవచ్చు.
Also Read: Blackout In Jammu: జమ్మూలో బ్లాక్ అవుట్, పేలుళ్ల శబ్దాలు.. ఒమర్ అబ్దుల్లా ట్వీట్
ఈ సూచనలు పాటించండి
హైదరాబాద్ నగరంలో వేడి పెరిగే అవకాశం ఉండడడంతో ప్రజలు వేడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీరు తీసుకోవడం, తేలికపాటి దుస్తులు ధరించడం, బహిరంగ కార్యకలాపాలను తగ్గించడం మంచిది. వర్ష సూచనలు ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు లేవు. అందువల్ల వేడి నుంచి రక్షణ కోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ఇలాంటి భిన్నమైన వాతావరణాన్ని నగరవాసులు ఎదుర్కోనున్నారు. అయితే మొత్తం మీద మే నెలలో మండే ఎండలు ఖాయమని తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.