Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి, నిర్మాతగా మారి ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ ను స్థాపించారు. ఆమె ప్రొడక్షన్ లో శుభం సినిమా తొలి ప్రయత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా రూపొందింది. కొత్త నటీ నటులతో, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ లో సమంతతో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. ఈవెంట్ విశేషాలు చూద్దాం..
ఫ్యాన్స్ లేకుండా నేను లేను..
వైజాగ్ లో జరిగిన శుభం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ.. వైజాగ్ లో నా సినిమాలు ఎన్నో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగాయి. ఆ సినిమాలన్నీ సక్సెస్ ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మీ ముందుకి శుభం సినిమాతో వస్తున్నాను. ఈ సినిమా కూడా వైజాగ్ లోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడంతో ఇది కూడా సూపర్ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కొత్త ఆలోచనలతో కొత్త కథలతో వచ్చేవారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే మా ట్రాలాల ప్రొడక్షన్ ని స్థాపించాను. కొత్త ఆలోచనలను ఆకట్టుకునే కథలను చెప్పే వారికి ఈ ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడు ప్రోత్సహిస్తుందని ఆమె తెలిపారు. సినిమా కోసమే పుట్టాను, సినిమాలు అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు, నిర్మాతగా సినిమాల కోసమే జీవిస్తున్నాను అని సమంత ఎమోషనల్ అయ్యారు. అభిమానులు ప్రశ్నలు అడుగుతూ మీ డై హార్డ్ ఫ్యాన్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అనే ప్రశ్న సమంతకి ఎదురవగా ఇందాక ఓ ఏవిని వేసి చూపించారు. అది నేను కాదు మీరు లేకుండా నేను లేను ఇది నా కష్టం కాదు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అది అభిమానులుగా మీరు నా మీద చూపిస్తున్న ప్రేమే. ఎప్పుడూ తనను ఆదరిస్తున్న, అభిమానులందరికీ థాంక్స్ చెప్పారు.
ఈ సినిమా అంతకుమించి ఉంటుంది.
ఇక సమంత సినిమా గురించి మాట్లాడుతూ .. శుభం సినిమా హర్రర్ కామెడీ అని అందరూ అనుకుంటున్నారు కానీ సినిమా చూసిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది అది అంతకన్నా ఎక్కువగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరూ ఓపిక చేసుకుని మే 9న థియేటర్స్ కి వెళ్లి మూవీ ని చూడండి. చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ చిరునవ్వులతో బయటికి వస్తారు. ఈ సినిమా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగానే మిమ్మల్ని అలరిస్తుంది. హర్రర్ జానెర్ ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే ఇది మీకు ట్రైలర్ చూస్తే హర్రర్ కామెడీగా అనిపిస్తుంది కానీ ఇది వేరే అంతకుమించి అని ఆమె తెలిపింది. ఇక స్టేజ్ పై మూవీ టీం తో కలిసి సమంత స్టెప్పులు వేశారు వచ్చిన అభిమానుల్లో జోష్ నింపారు.
దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ..
నేను ఇదే వైజాగ్ లో పుట్టి పెరిగాను ఇక్కడ ఇదే ప్లేస్ లో ఎన్నోసార్లు కూర్చుని నా జీవితంలో ఏం చేయాలో అని ఆలోచించాను. ఎంతో కష్టపడితే గాని నేను ఈ స్థితికి రాలేదు. నేను ఈ సినీ ప్రపంచంలోకి రావడానికి నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ఈ వేదిక తరపున నేను థాంక్స్ చెప్తున్నాను అందులో నా తల్లిదండ్రులు నా భార్య ముఖ్యపాత్ర పోషించారు. ఈ శుభం సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఈ సినిమా చూసినప్పుడు మీకు కొత్త అనుభూతి కలుగుతుంది. చిన్న సినిమాలోని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు సమంత. అలాంటి సమంత బ్రాండ్ నిజంగా మాకు ఎంతో కలిసొస్తుంది. అలాంటివారు ఎంకరేజ్ చేయబట్టే మేము ఇక్కడ దాకా వచ్చాము. సినిమా ఏదైనా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు చూస్తారు. నేను కంటెంట్నే ఎక్కువ నమ్ముతాను. ఇక కథ ముందు కనిపించే డైరెక్టర్గా నేను మీ అందరికీ తెలుసు కానీ నా వెనక ఎంతో కష్టపడినా రైటర్ గురించి ఎవరికీ తెలీదు ఈ మూవీకి రైటర్ గా పని చేసిన వసంత చాలా కష్టపడ్డాడు. ప్రతి సినిమాలోని డైరెక్టర్ ని కష్టపడినట్లు చూపిస్తారు కానీ అంతకుమించి కష్టం రైటర్ పడతాడు. సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు హర్షిత్ ,శ్రీయ వారి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక అందరూ సినిమా మే 9న థియేటర్లకు వెళ్లి చూడండి. ఫస్ట్ షో చూసిన వారందరూ నిజంగా చాలా లక్కీ. వారే ప్రతి ఒక్కరికి చెప్పి సినిమాని హిట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. అని దర్శకుడు తెలిపారు.
రైటర్ వసంత్ మాట్లాడుతూ..
మీ మూమెంట్ ని నేను 15 సంవత్సరాల నుండి ఇలాంటి మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు నిజంగా నా జీవితంలోకి ఈరోజు వచ్చింది. మా ఈ సినిమా మూవీ టీమ్ అందరికీ నేను థాంక్స్ చెప్పాలి. ఫస్ట్ సమంత గారి గురించి మాట్లాడాలి డిఫరెంట్ కాన్సెప్ట్ ఆవిడ నమ్మి ముందుకు తీసుకొచ్చారు. అందరిలోకి ఈ సినిమా తీసుకెళ్లారు అంటే అది సమంత వల్ల జరిగింది. హిమంత్ ఈ సినిమాకి మరో ప్రొడ్యూసర్. గ్రౌండ్ లెవెల్ లో ఉండి ఆయన సినిమా కోసం కష్టపడ్డారు. నేను సినిమా బండి చిత్రంతో ప్రవీణ్ తో కలిసి పని చేశాను. సినిమా అంటే చాలా ఇష్టం డైరెక్టర్ ప్రవీణ్ కి, ఎవరు ఐడియా చెప్పిన ఈగో పక్కన పెట్టి అందరు సలహా తీసుకుంటాడు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచింది రైటర్ రాజు. ఈ వేదికగా ఆయనకు థాంక్స్ చెప్తున్నాను. ఆయన నాకు గురువుతో సమానం. ఈ సినిమాకి నటీనటులు అందరు చాలా బాగా చేశారు. టీవీ సీరియల్ జానర్ లో వచ్చే హర్రర్ కామెడీ మూవీ ఇది. మే 9న ప్రేక్షకుల మందికి వస్తుంది అందరూ చూడండి అని ఆయన తెలిపారు.
ఐదు సంవత్సరాల తరువాత ..
హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నేను సమంత మేడంకి ఫుల్ ఫ్యాన్ ని. ఓ బేబీ టైంలో ఆడిషన్స్ కి వెళ్ళాను. అప్పుడు సెలెక్ట్ అవ్వలేదు ఐదు సంవత్సరాల తర్వాత ఆమె తీస్తున్న సినిమాలో నేను హీరో అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె ఎంత మందితో సినిమాలు తీసిన మొదటి సినిమా హీరోని నేనే అవడం నాకెంతో హ్యాపీగా ఉంది అని’ హర్షిత్ రెడ్డి తెలిపారు. ఇక మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది మే 9న జగదాంబ థియేటర్లో అరుపులతో పేలిపోవాలి సినిమా అలా ఉంటుంది. అని హీరోయిన్ శ్రేయ తెలిపారు.
ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, శ్రియ, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శాలిని కొండేపూడి, ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సమంత ప్రత్యేకమైన అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.