BigTV English

Samantha:సెంటిమెంటుతో కొట్టిన సమంత.. మళ్ళీ ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుందా?

Samantha:సెంటిమెంటుతో కొట్టిన సమంత.. మళ్ళీ ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుందా?

Samantha: టాలీవుడ్ లో చిన్న సినిమాలు ఎన్నో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కొన్ని సినిమాలు సక్సెస్ ని రుచి చూస్తున్నాయి మరికొన్ని థియేటర్లలో కూడా రాకుండా వెన్ను తిరుగుతున్నాయి. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో ఎంతోమంది తెలుగు స్టార్స్ ముందుంటారు. ఇటీవల విడుదలైన కోర్టు మూవీ చిన్న సినిమాగా మన ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హీట్ అని అందుకుంది. ఆ సినిమా నిర్మాతగా హీరో నాని మూవీని రూపొందించడం విశేషం. ఇప్పుడు అదే కోవలో స్టార్ హీరోయిన్ సమంత చేరారు. సమంత నిర్మాతగా తీస్తున్న సినిమా శుభం. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి నిర్మాతగా తొలిసారి ఈ మూవీతో మన ముందుకు రానున్నారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శికత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా సమంత పాల్గొన్నారు. ఆమె ఈవెంట్ లో సినిమా సెంటిమెంట్ గురించి మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం..


సెంటిమెంటుతో కొట్టిన సమంత..

 సమంత మాట్లాడుతూ.. ‘నా ఎన్నో సినిమాలు ఈవెంట్స్ వైజాగ్ వేదికగా జరిగాయి. మజిలీ,ఓబేబీ,రంగస్థలం సినిమాలు ఇక్కడే వైజాగ్ లో జరిగాయి.ఆ సినిమాలు అన్ని హిట్ అయ్యాయి ఇప్పుడు ఈ మూవీ కూడ హిట్ అవుతుంది. నేను ఒకసారి వైజాగ్ వచ్చినప్పుడు ఎయిర్ పోర్ట్ నుంచి నాకెంతో ఘన స్వాగతం పలికారు ఇక్కడ ఫాన్స్ . సినిమా అంటే నాకు ప్రాణం ఒక నటిగా,, ప్రొడ్యూసర్ గా సినిమాని ఆస్వాదిస్తాను. అందర్నీ ఆకట్టుకునే కథ, అందరినీ ఎంకరేజ్ చేసే ప్రొడక్షన్స్ స్థాపించాలని అనుకొని ఈ ట్రాలాల నిర్మించాను. మే 9న మొత్తం ఫ్యామిలీతో పాటు తీరిక చేసుకో వెళ్లి శుభం చూడండి. ఒక చిరునవ్వుతో థియేటర్ నుండి బయటకు వస్తారు’ అని ఆమె తెలిపారు. హర్రర్ కామెడీ ఎంచుకోవడానికి ఏంటి రీజన్ అంటే, మీకు చూడ్డానికి హర్రర్ కామెడీ లా కనిపిస్తుంది కానీ మే9న మీరు థియేటర్ కి వెళ్లి చూస్తే తెలుస్తుంది.అంతకు మించి ఉంటుంది.అని ఆమె తెలిపింది.


అతిధి పాత్రలో సమంత..

ఇక శుభం సినిమా లో నటించే వారంతా కొత్తవారు కావడం విశేషం. సినిమా బండి ఫ్రేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ తదితరులు ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటించారు. సమంత ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో ఆమె ఓ మాతాజీ పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా రిలీజ్ అయిన జన్మజన్మల బంధం సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి ఈ సినిమా మే 9న ప్రేక్షకులకు ముందుకు రానుంది. చిన్న సినిమాల కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు మరి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Good Bad Ugly : అప్పుడే ఓటీటీకి అజీత్.. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×