BigTV English

OTT Movie : వే*శ్యా గృహంలో వెర్రివేషాలు… అమ్మాయిలకు నరకం చూపిస్తూ… ఏందిరా సామి ఈ అరాచకం

OTT Movie : వే*శ్యా గృహంలో వెర్రివేషాలు… అమ్మాయిలకు నరకం చూపిస్తూ… ఏందిరా సామి ఈ అరాచకం

OTT Movie : టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారు కొంతమంది. మరికొంతమంది సొంత తల్లిదండ్రులే అమ్మాయి పుట్టిందని అమ్మేస్తూ ఉంటారు. వీళ్ళంతా వ్యభిచార కూపంలో నరకం చూస్తుంటారు. ఎంతోమంది జీవితాలు ఇక్కడ అంతరించి పోయాయి. వెలుగులోకి రాని జీవితాలు మరెన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, చిన్న వయసులోనే బలవంతంగా వేశ్యా గృహంలోకి నెట్టేసిన లక్ష్మీ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది.  ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే

లక్ష్మి అనే 13 ఏళ్ల బాలికను, ఒక గ్రామం నుండి చిన్నా అనే వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. చిన్నా ఆమెను తన బాస్ అయిన రెడ్డి దగ్గరకూ తీసుకెళతాడు. లక్ష్మి మొదట్లో అక్కడ ఇంటి పని మనిషిగా పని చేస్తుందని భావిస్తుంది. కానీ త్వరలోనే ఆమెను వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా నెట్టివేస్తారు. ఈ క్రమంలో ఆమె అత్యాచారానికి గురవుతుంది. ఆమెను అక్కడ ఉన్నవాళ్ళు రకరకాలుగా టార్చర్ చేస్తారు. ఆ తరువాత ఆమె ఇతర బాలికల సహాయంతో, ధైర్యం తెచ్చుకుని బతికి ఉంటుంది.


లక్ష్మి వేశ్యాగృహంలో జ్యోతి అనే స్త్రీని కలుస్తుంది. ఆమె తన కూతురు చదువు కోసం రెడ్డి వద్ద పని చేస్తుంది. ఉమ అనే మరో స్త్రీ బాలికలకు శానిటరీ వస్తువులు, స్వీట్లు తెచ్చి సహాయం చేస్తుంది. లక్ష్మి ఒకసారి ఓ క్లయింట్ ఇంటికి వెళ్లినప్పుడు, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అంతలోనే పట్టుబడి ఘోరంగా దెబ్బలు తింటుంది. ఈ ఘటనలో ఆమెకు తగిలిన గాయం, ఇన్ఫెక్షన్ గా మారుతుంది. అయితే ఆ సమయంలో జ్యోతి ఆమెను కాపాడుతుంది.

ఒక రోజు మోహన్ అనే అండర్‌కవర్ ఏజెంట్, జ్యోతి, ఉమ సహాయంతో వేశ్యా*గృహంపై దాడి చేస్తారు. రెడ్డి, చిన్నాను అరెస్ట్ చేసి బాలికలను మహిళా షెల్టర్‌కు తరలిస్తారు. అయితే రెడ్డిపై ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు. ఒక్కొక్కరూ మళ్ళీ వే*శ్యాగృహానికి తిరిగి వెళ్తారు. కానీ లక్ష్మి మాత్రమే షెల్టర్‌లో ఉంటుంది. అతనిపై కేసు పెట్టడానికి లక్ష్మి ధైర్యం చూపిస్తుంది. చివరికి తనపై అమానుషంగా ప్రవర్తించిన వాళ్ళపై లక్ష్మి కేసు పెడుతుందా ? వాళ్ళకు శిక్ష పడే విధంగా చేస్తుందా ? సమాజంలో లక్ష్మీ ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : వామ్మో ఇన్సూరెన్స్ పైసల కోసం సొంత చెల్లినే… ఈ ఖిలాడి లేడీ మామూలుగా లేదురా సామీ

యూట్యూబ్ (Youtube) లో

ఈ బయోగ్రాఫికల్ సోషల్ డ్రామా పేరు ‘లక్ష్మి’ (Lakshmi). 2014 లో విడుదలైన ఈ మూవీకి నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది. ఇందులో మోనాలీ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించగా, షెఫాలీ షా, రామ్ కపూర్, సతీష్ కౌశిక్, నాగేష్ కుకునూర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. 2014 పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, ఈ మూవీ ‘బెస్ట్ ఫిల్మ్  మెర్సిడెస్ బెంజ్ ఆడియన్స్’ అవార్డ్ ను గెలుచుకుంది. ఈ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×