BigTV English

Odela-2: లైవ్ లోకి శివయ్యనే తెచ్చారు… ప్రమోషన్స్ కి దేవుడినే వాడుతున్న సంపత్ నంది!

Odela-2: లైవ్ లోకి శివయ్యనే తెచ్చారు… ప్రమోషన్స్ కి దేవుడినే వాడుతున్న సంపత్ నంది!

Odela-2: తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా సినిమా ఓదెల -2.. ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్రలో వచ్చిన ఓదెల రైల్వేస్టేషన్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమానే ఓదెల- 2..ఈ సినిమాలో హెబ్బా పటేల్ , వశిష్ట ఎన్ సింహ కీలక పాత్రల్లో చేస్తున్నప్పటికీ మెయిన్ పాత్ర మాత్రం తమన్నాదే.తమన్నా ఈ మూవీలో నాగసాధ్విగా కనిపించబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా ఓదెల- 2 మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఘనంగా చేశారు.


ప్రమోషన్స్ లో ఇదో కొత్త స్ట్రాటజీ..

అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా ఐదు రోజులే ఉన్న తరుణంలో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ కోసం ఏకంగా దేవుడినే వాడేసారు డైరెక్టర్ సంపత్ నంది. మరి ఇంతకీ సంపత్ నంది చేసిన ఆ పనేంటో ఇప్పుడు చూద్దాం. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్ బ్యానర్ పై మధు,సంపత్ నంది నిర్మాతలుగా చేస్తున్న ఓదెల -2 మూవీ ఏప్రిల్ 17న విడుదల కాబోతుండడంతో.. తాజాగా వెరైటీ ప్రమోషన్ చేశారు సంపత్ నంది. అయితే ఆ ప్రమోషన్ కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ ప్రోమోలో ఏముందంటే.. సంపత్ నంది, తమన్నా ఇద్దరూ లైవ్ లోకి చాలామంది శివ శక్తులను తీసుకువచ్చి ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో భాగంగా సంపత్ నంది మీరు సినిమాలు చూస్తారో లేదో తెలియదు. కానీ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.


ప్రమోషన్స్ కోసం దేవుడిని రంగంలోకి దింపిన సంపత్ నంది..

అలాగే ఈ సినిమాలో చిన్న చిన్న తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించండి అంటూ చెప్పుకొచ్చారు. అలాగే దేవుడి మీద నాకు ఇంత నమ్మకం ఉన్నా కూడా ఒక డౌట్ ఉంది. మీకు పూనకం వచ్చినప్పుడు నిజంగానే ఆ శివయ్య కనిపిస్తాడా అంటూ సంపత్ నంది ప్రశ్నించారు. ఇక ఆయన ప్రశ్నతో లైవ్ లోనే చాలామంది శివశక్తులకు పూనకం వచ్చినట్లు చూపించారు. అక్కడితో ప్రోమో ఎండ్ అయింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారడంతో ఈ ప్రోమో చూసిన నెటిజన్లు సినిమా కోసం ఏకంగా దేవుడినే వాడేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇది చూసిన మరి కొంతమంది నెటిజన్స్ ఇదో సరికొత్త స్ట్రాటజీ.. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి బృందం ఏదైనా చేస్తుంది అంటూ అటు కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా భారీ అంజనాల మధ్య ఎన్నో సరికొత్త ప్రమోషన్స్ అంతకుమించి స్ట్రాటజీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక తమన్నాకు ఈ సినిమా అత్యంత కీలకమని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అయితే ఈమెకు మళ్ళీ తెలుగులో అవకాశాలు వస్తాయి. లేకపోతే మళ్లీ ఇండస్ట్రీకి దూరం కావాల్సిందేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

 

Hebah Patel : ఏంటమ్మా… హీరో ఎవరో తెలియకుండానే… రెండు సార్లు చేశావా..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×