Hebah Patel : టాలీవుడ్ అందాల నటి హెబ్బా పటేల్ ‘కుమారి21ఎఫ్’ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా సినిమాలు చేసిన పెద్దగా ఏ సినిమా తనకి గుర్తింపు తీసుకురాలేదు. ఓదెలా రైల్వే స్టేషన్ సినిమా నటిగా ఆమెకి మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ లో, తమన్నా శివశక్తి పాత్ర లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో వశిష్ట సింహ, నాగ మహేష్, వంశి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. సంపత్ నందితో కలిసి డి.మధు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధమైంది. మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగా హెబ్బా పటేల్, వశిష్ట సింహ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హెబ్బా పటేల్ వశిష్ట ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి..
హెబ్బా మాటలకూ షాక్ అయిన వశిష్ట సింహ..
మీరు సినిమాలోనే వశిష్ట సింహని కలిసారా అంతకుముందు ఆయన గురించి మీకు తెలుసా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా.. హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ‘నేనింతవరకే ఆయన సినిమాలు చూడలేదు, కన్నడంలో ఆయనతో కలిసి సినిమాలో నటించాను. కానీ నేను ఆయన సినిమాలు ప్రత్యేకంగా చూడలేదు. సెట్ లో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడతాను అంతేకానీ ఆయన ముందు సినిమాలు గురించి నాకు తెలియదు’ అని హెబ్బా పటేల్ వశిష్టముందే చెప్పడంతో ఒకసారిగా వశిష్ట సింహ షాక్ అవుతాడు. యాంకర్ ఆయన క్రూరంగా, భయపడేటట్లు చేస్తారని మీరు చూడరా అని అడగ్గా.. నో నాకు అసలు వశిష్ట ఇంతకు ముందు కూడ ఎవరో తెలియదు అని సమాధానం చెప్పింది. ఈ వీడియో చూసిన వారంతా హీరోలతో సినిమాలు అయితే చేస్తుంది కానీ కనీసం వారి గురించి ఆమెకు తెలియదు పాపం అని కామెంట్స్ చేస్తున్నారు.
ఆమెతో చేయటం నాకు సంతోషం ..
సినిమా గురించి ఆమె మాట్లాడుతూ .. ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో రాధ పాత్ర నాకెప్పటికీ గుర్తుంటుంది. అయితే దానికి కొనసాగింపుగా మరో సినిమా వస్తుందని ఆ సినిమా తీసేటప్పుడు అనుకోలేదు. ఆ సినిమాలో ఎక్కువ నేను జైలు సన్నివేశాల్లోనే కనిపిస్తాను. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో తమన్నా నటిస్తుంది. ఆమెతో కలిసి చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఆమె సోదరీగా ఈ సినిమాలో నేను నటిస్తున్నాను. ఇద్దరం కలిసి చాలా సీన్లలోనే సినిమాలో కనిపిస్తాము. మొదటి పార్ట్ ఎంత సక్సెస్ గా నిలిచిందో ఈ సినిమా అంతే సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సినిమా పరంగా కన్నడంలో ఒక సినిమాని చేస్తున్నాను. దాని తరువాత తెలుగులో మరో ప్రాజెక్ట్ తో మీ ముందుకి త్వరలోనే వస్తాను’ అని చెప్పుకొచ్చింది హెబ్బా పటేల్.
Also read: Keerthi Bhat: ప్రియుడు బాగోతం బట్టబయలు.. డిఎన్ఏ టెస్ట్ లో విస్తు పోయే నిజాలు..