BigTV English

Peddi : ఓరిని పెద్ది గ్లిమ్స్ లో ఇది గమనించారా? అరాచకంరా బాబు..

Peddi : ఓరిని పెద్ది గ్లిమ్స్ లో ఇది గమనించారా? అరాచకంరా బాబు..

Ram charan:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రానున్న చిత్రం పెద్ది. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం రానుంది. పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకులు ముందుకి వచ్చే ఏడాది వేసవికి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి పండుగనాడు గ్లిమ్స్ పేరుతో ఆదివారం ఒక ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. మెగా అభిమానులకు పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ గ్లిమ్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ గ్లిమ్స్ లో ఎవరు గమనించని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


పెద్ద గ్లిమ్స్ లో ఇది గమనించారా..

పెద్ది గ్లిమ్స్ వీడియో స్టార్టింగ్ లో క్రికెట్ మ్యాచ్ దగ్గర జనాలు ఆరంజ్ కలర్ ఫ్లాగ్స్ పట్టుకొని అరుస్తూ ఉంటారు. ఆ ఫ్లాక్స్ పైన విజయనగరం అనే టెక్స్ట్ అండ్ ఒక లోగో ఉంటుంది. ఆ లోగో పూర్తిగా అర్థం కాకపోయినా మనకి విజయనగరం అన్న పేరు కనిపిస్తుంది. ఆ తర్వాత హీరో జనాలపై నుండి జంప్ చేసి మైదానంలోకి వచ్చే షాట్ లో ఎడమవైపు ప్యాంటు పైకి మడిచి ఉంటుంది. కుడి వైపు నార్మల్ గా ఉంటుంది. ఇది చూడటానికి చాలా క్రేజీగా ఉంటుంది. ఇక మైదానంలో బ్యాట్ కిందకి కొట్టి బాల్ ని ఒక షార్ట్ ఇస్తాడు. బ్యాట్ గ్రిప్ కోసం కింద కొట్టడం కాదు. అలా కింద కొట్టడమే ఒక విజువల్ ఎఫెక్ట్. ఈ షాట్ లో క్రియేటివిటీ మాస్ అప్పీరెన్స్ రెండు కనిపించేట్లు డైరెక్ట్ చేశారు. ఇలాంటివి అంతకు ముందు వచ్చిన సినిమాల్లో కూడా మనం గమనించాం. అరవింద సమేతలో ఎన్టీఆర్ ఒక సీన్ లో కత్తిని చాలా క్లోజ్ గా పట్టుకోవడం చూపిస్తారు. అలాగే ఇప్పుడు బ్యాటరీ కూడా కింద కొట్టి, రామ్ చరణ్ బాల్ ని షార్ట్ కొట్టడం చాలా క్రేజీగా అనిపిస్తుంది. మనకి గ్లిమ్స్ మొత్తంలో బాగా గుర్తుండే షాట్ కూడా మైదానంలో రామ్ చరణ్ సీన్. చిన్న వీడియోలోనే ఇంత చూపించారంటే, సినిమాలో రామ్ చరణ్ అభిమానులు కాలరేగరేసే సీన్స్ ఉంటాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.


గ్లోబల్ స్టార్ అరాచకం..

ఇక ఈ సినిమా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. గ్లిమ్స్ చూసిన తర్వాత ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్. చాలా రోజుల తర్వాత తెలుగులో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేస్తున్న సినిమా కావటం విశేషం. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సంవత్సరం రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో మన ముందుకు వచ్చి ఒక సూపర్ డీసెంట్ హీట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. పెద్ది సినిమాతో పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకోవాలని కోరుకుందాం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×