BigTV English

Intinti Ramayanam Today Episode: పల్లవిని ఇరికించిన అవని.. కండీషన్ పెట్టిన పార్వతి..

Intinti Ramayanam Today Episode: పల్లవిని ఇరికించిన అవని.. కండీషన్ పెట్టిన పార్వతి..

Intinti Ramayanam Today Episode April 13th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవనిని శాశ్వతంగా ఇంటికి దూరం చేశానని పల్లవి సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. అయితే అక్షయ బావతో అవని అక్కకు విడాకులు ఇప్పిచ్చేసి ఇంకో పెళ్లి చేస్తే నా పని అయిపోతుంది అప్పుడు ఇంట్లో వాళ్లకి నా మీద అనుమానం వచ్చినా ఏమీ చేయలేరని సంబరపడిపోతూ నవ్వుకుంటుంది. అప్పుడే అవని ఫోన్ చేస్తుంది. ఏంటి అవని ఫోన్ చేస్తుంది శ్రీరామనవమి జరగదని వాళ్ళ మరదలు చెప్పారేమో కళ్యాణం జరిపించడానికి నాకు కాళ్లు పట్టుకొని ఒప్పించమని అడగడానికి ఫోన్ చేసిందేమో అని అనుకుంటుంది.. ఆ మేటర్ లో ఇన్వాల్వ్ కావద్దనింది నాకు చెప్పుతో వార్నింగ్ ఇచ్చింది. నన్ను చంపలు పగలగొట్టింది. ఎలాగైనా నేను రివెంజ్ తీర్చుకోవాలి. ఏంటో కనుక్కోవాలని ఉంటుంది. పల్లవికి అవని షాకిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


 

ఇక ప్రోమో విషయానికొస్తే.. పల్లవి వెంటనే అవని పిలిచిన దగ్గరికి వెళుతుంది. ఏమైందని అడగ్గని నువ్వు సీతారాముల వారి కళ్యాణం జరిపించడానికి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించాలి. మేమిద్దరం పీటల మీద కూర్చునేలా చేసి ఈ కళ్యాణం జరిగేలా చేయాలి లేదంటే మాత్రం నువ్వు వెళ్తావని వార్నింగ్ ఇస్తుంది. తాటాకు చప్పులకు పల్లవి భయపడదు అని వెళ్ళిపోతుంది. అవని పల్లవిని చిటికేసి ఆపుతుంది. నువ్వు ఆరోజు దాచిన రహస్యం ఇప్పుడు అందరికీ చూపిస్తే ఏమవుతుందో తెలుసా? ఇంట్లో వాళ్ళందరూ నేను చీకొట్టడమే కాదు చంపి పాత్ర వేస్తారు అని అంటుంది.


 

ఇక నా ఫోన్లో ఈ వీడియో ఉన్నంతవరకు నువ్వు నన్ను ఏమి చేయలేవు నేను చెప్పినట్లు ఆడాల్సిందే నేను చెప్పినట్టు చేయాల్సిందే అని ఓ ఆట ఆడుకుంటుంది. పల్లవి మొదట టెన్షన్ పడుతుంది తర్వాత నువ్వు చెప్పినట్టే చేస్తానక్కా ఆ వీడియోని మాత్రం ఎవరికీ చూపించదు అని భయపడుతుంది. ఇంటికి వెళ్ళగానే అందర్నీ కేకలు వేసి పిలుస్తుంది. ఏమైంది ఎందుకు ఇలా అరుస్తున్నావు అంటే సీతారాముల వారి కల్యాణం జరిపిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను మామయ్య జరిపిద్దామని అందర్నీ అడుగుతుంది. ముందు మాత్రం వద్దని వాదిస్తారు. కానీ పల్లవి మాటలకు మగవాళ్ళు సైలెంట్ గా ఉంటారు.. ఏమైందని పల్లవి అంటుంది. అందరు కలిసి పల్లవిని మెచ్చుకుంటారు.

రాజేంద్రప్రసాద్ పల్లవి చెప్పిన మాటలు విని నువ్వు చెప్పింది కూడా నిజమే మనము సీతారాముల కళ్యాణం జరిపిద్దాం అని ఒప్పుకుంటాడు. అవని లేకుండా ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని అంటాడు.. అందరూ ఒప్పుకున్నారు కదా అత్తయ్య మీరు కూడా ఒప్పుకోండి అని ఒప్పిస్తుంది. ఇక ఉదయం సీతారాముల కళ్యాణం జరగనుంది కాబట్టి మనందరం తొందరగా లేసి గుడికి వెళ్లాలని పార్వతి అంటుంది. అందరూ గుడికి వెళ్లడానికి రెడీ అవుతుంటారు. అవని కూడా గుడికి వెళ్లేందుకు పట్టుచీర కట్టుకొని రెడీ అవుతుంది.

అందరు కలిసి సంతోషంగా గుడికి వెళ్తారు. అక్కడ కళ్యాణం జరిపించాలని అనుకుంటారు. అక్కడ గుడికి వెళ్లిన వాళ్లంతా కళ్యాణం జరిపించాలని అనుకుంటారు. అయితే పూజారితో పూజ గురించి చెప్తారు. కళ్యాణం కోసం పెద్ద కోడలు లేదని చెప్పాము కదా అంటుంది. మీ పెద్ద కోడలు ఇక్కడే ఉందమ్మా అంటాడు. అప్పుడే అవని అక్కడకు వస్తుంది. నేను ముందుగా చెప్పినట్లు ఈ పూజకు రాను నేను వెళ్లిపోతున్నా అని అంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పార్వతి పూజకు వస్తుందా? అవని అక్షయ్ లు కలిసి కళ్యాణం జరిపిస్తారేమో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×