Illu Illalu Pillalu Today Episode April 13 opth : నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు తన పెద్ద కొడుకు పెళ్లి ని చూస్తాడని అస్సలు అనుకోలేదు. ఈ జన్మలో కొడుకుకి పెళ్లి కాలేదని బాధపడుతూ ఉన్న క్షణాలను తలుచుకొని బాధపడతాడు. బుజ్జమ్మ రామరాజు దగ్గరికి రాగానే నా కొడుకుకు పెళ్లి మరి కొన్ని గంటల్లో జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జన్మలో నేను వాడి పెళ్లి చూస్తానని అస్సలు అనుకోలేదని ఆనందపడతాడు. అటు భద్ర సేన ఇద్దరూ రామరాజు కొడుకు పెళ్లి అవ్వదని అనుకున్నారు.. కానీ ఇప్పుడు పెళ్లి అవుతుండడంతో ఆ కోపాన్ని ఆ కక్షను ఓర్చుకోలేక పోతారు. ఆ రామరాజుని ఎంతగా దెబ్బ కొట్టాలని చూసినా వాడు అంతగా తిరిగి సంతోషాన్ని పొందుతున్నాడు ఏం చేస్తే వాడు ఏడుస్తాడో అర్థం కావట్లేదు సేన అని భద్ర అంటుంది. విశ్వం పెళ్లిని ఆపే ప్రయత్నం చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. రామరాజు ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. అందరిని రిసీవ్ చేసుకుంటూ కొడుకులతో అవి ఇవి ఏంటో చెబుతూ ఉంటాడు. ధీరజ్త తన తండ్రి తనతో మాట్లాడుతున్నాడని సంతోషపడతాడు. బుజ్జమ్మ హడావుడి చూసి నర్మదా కూడా సెటైర్లు వేస్తుంది. పెళ్లి పనులు నేనొక్కదాన్నే చూసుకుంటున్నాను కనీసం ఎవరు సాయం చేయాలని అనుకోవట్లేదు. అందుకే నేను అలిసిపోతున్నానని అంటుంది. అత్త మీద ఆమె వేసే సెటైర్స్ అక్కడ ఉన్న వారిని ఆకట్టుకున్నాయి. నువ్వు ఇలా కల్పించుకొని నాకు జ్యూసులుగా ట్రై చేస్తూ ఉండాలి అమ్మాయి అనేసి వేదవతి అంటుంది. ఇక ధీరజ్ వచ్చేసి ప్రేమను చూసి సంతోషపడతాడు. ప్రేమ అందాన్ని వేరే వాళ్ళ పొగుడుతుంటేనే తను నా భార్య మీరెవరు పొగడ్డానికి అనేసి అంటాడు.. నీ పని మీరు చూసుకుంటే మంచిది అని వాళ్లకు వార్నింగ్ ఇస్తారు ఇక ప్రేమతో ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు నిజంగానే దేవకన్యలా ఉన్నావని పొగడ్తలతో ముంచేస్తాడు..
ప్రేమ మనసులో ప్రేమను సంపాదించుకోవడం కోసం బాగా ట్రై చేస్తాడు ధీరజ్.. ఇక ప్రేమ వచ్చి కవర్ చేసుకుంది చాల్లే ఈ చీర ఎలా ఉందో చెప్పు ని అడుగుతుంది ప్రేమ. బాగుంది బాగుంది.. రేటు తక్కువ అయినా రిచ్‌గా ఉంది అని అంటాడు ధీరజ్. ఈ చీరకి రిచ్ నెస్ వచ్చింది నావల్ల. నేను కట్టుకోవడం వల్ల అని అంటుంది. నీకంత లేదు.. ఆ చీర నా సెలక్షన్.. అందుకే అంత బాగుంది.. అంతే తప్ప నీ పైనాపిల్ ఫేస్‌కి అంత సీన్ లేదు అని అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ.. సరే నీకు నచ్చలేదు కదా.. అయితే నీ చావు నువ్వు చావు.. నేను ఇంటికి వెళ్లిపోతాను అని వెళ్లిపోబోతుంది ప్రేమ. దాంతో ధీరజ్.. వద్దు వద్దు అని బ్రతిమిలాడతాడు.
ధీరజ్ సారీ చెప్పడంతో ప్రేమ కూల్ అవుతుంది. ధీరజ్‌తో ఆడుకుంటుంది ప్రేమ. సరేనని మళ్లీ మళ్లీ సారీ చెప్తాడు ధీరజ్. వెరీ గుడ్ అమ్మా.. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండు అని స్వీట్ వార్నింగ్ ఇస్తుంది ప్రేమ. చెప్తానే నీ సంగతి.. శాడిష్టులా ఉంది అని అని అంటాడు. పొగిడింది చాల్లే కానీ.. వెళ్లి పని పనులు చూద్దాం అని ముప్పుతిప్పలుపెడుతుంది ప్రేమ..
చూసింది చాల్లే కానీ పదా అని గాలి తీసేస్తుంది ప్రేమ. ఇక పెళ్లి కూతురు శ్రీవల్లిని తెగ ముస్తాబు చేస్తుంటారు పెళ్లి మండపంలో ఇంతలో ఆమెను కిడ్నాప్ చేయడానికి బ్యుటీషియన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇక కూతుర్ని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ తెగ మురిసిపోతుంటుంది భాగ్యం. మా అమ్మడు కుందనపు బొమ్మలా ఉంది పొంగిపోతుంది.. ఇక అందరు పెళ్లి కోసం వెయిట్ చేస్తుంటారు.
పది వేలు ఇచ్చి మేకప్ వేయించొచ్చు కదమ్మా.. డబ్బులు ఖర్చు అవుతాయని కక్కుర్తి పడుతున్నావ్ అని అంటుంది శ్రీవల్లి. ‘చందమామకి వెలుగు ఎందుకే’ అని అంటుంది భాగ్యం. ఖర్చుల కోసం మా ఆయన పది లక్షలు ఇచ్చాడు కదా.. నా మేకప్ కోసం ఖర్చు పెట్టలేవా? ఏంటీ అని అంటుంది శ్రీవల్లి. అయ్ బాబోయ్.. అప్పుడే మా డబ్బులు.. మా ఆయన అని అనేస్తున్నావే.. అని భాగ్యం అంటే.. కాసేపట్లో పెళ్లి అయిపోతుంది కదమ్మా అని తెగ సిగ్గుపడిపోతుంది శ్రీవల్లి. అవునే అమ్మడూ.. మీ పెళ్లి అయిపోనట్టే ఇక మీ పెళ్లి ఎట్టాంటి ఆటంకాలు.. అడ్డంకులు లేవు అని అంటుంది భాగ్యం..
పెళ్లిని ఆపేశక్తి మీ భూమిపై ఎవరికీ లేదు అని భాగ్యం అనేసరికి.. నాకు ఉంది కదా అన్నట్టుగా వచ్చి తలుపుకొడుతుంది బ్యుటీషియన్. ఎవరు మీరు అని అంటే.. నేను మేకప్ ఆర్టిస్ట్‌ని అని పరిచయం చేసుకుని శ్రీవల్లి దగ్గరకు వెళ్తుంది. మేకప్ కావాలని నేను చెప్పలేదు కదా.. నువ్వెందుకు వచ్చావ్ అని భాగ్యం అడిగితే.. నన్ను పెళ్లి కొడుకు వాళ్లు పంపించారు అని అంటుంది.. డబ్బులు వాళ్ళే ఇస్తారని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..