Sundar C : తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో సుందర్ సి ఒకరు ఎన్నో అద్భుతమైన సినిమాలను తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో అందించారు సుందర్. కేవలం సినిమాలు దర్శకుడుగా చేయడమే కాకుండా నటుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. సుందర్ దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో కూడా ఆయన కనిపించారు. రజనీకాంత్ హీరోగా నటించిన అరుణాచలం సినిమాకు దర్శకత్వం వహించింది ఈయనే. అలానే కమల్ హాసన్ రాసిన అన్బే శివ సినిమాకు కూడా ఈయన దర్శకత్వం వహించారు. ఇదే సినిమాను తెలుగులో సత్యం సుందరం పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో కమల్ హాసన్ ఆర్ మాధవన్ కలిసిన నటించారు. ఈ సినిమాకు మంచి కల్ట్ స్టేటస్ ఉంది. ఇప్పటికీ కూడా ఈ సినిమా గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన కార్తి సత్యం సుందరం సినిమా అప్పుడు కూడా ఈ సినిమా టాపిక్ నడిచింది.
డైరెక్టర్స్ మూడు రకాలు
రీసెంట్ గా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో జరిగిన ఒక ఈవెంట్లో సుందర్ సి మాట్లాడుతూ మూడు రకాల డైరెక్టర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఒకటి తనకు నచ్చినట్లుగా సినిమా తీసే డైరెక్టర్లు, రెండు ఆడియన్స్ కి నచ్చినట్లు సినిమా తీసే డైరెక్టర్లు, మూడు హీరోలకు నచ్చినట్లుగా తీసే డైరెక్టర్ లు అని చెప్పుకొచ్చారు. ఈ మాటల్లో కొంతవరకు వాస్తవం ఉన్నా కూడా కంప్లీట్ గా ఒప్పుకోలేము. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ నేను రెండో రకం డైరెక్టర్ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాట ప్రకారమే వస్తే రజినీకాంత్ కమలహాసన్ వంటి స్టార్ హీరోలతో పని చేసిన అనుభవం ఆయనకి ఉంది. అదృష్టవశాత్తు వాళ్ళిద్దరితో చేసిన సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. అవి ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడు ఆయన లెక్క ప్రకారం వాళ్ళిద్దరూ స్టార్ హీరోలు కారు అని అనుకుంటున్నారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు మొదలయ్యాయి.
సుందర్ సి ప్రయాణం
1995-వ సంవత్సరం ముఱై మామన్ అనే హాస్యరసప్రధాన చిత్రముతో సుందర్ సీ మొదటిసారి దర్శకులురా మారారు, ఆ తర్వాత ముఱైమాప్పిళ్ళై, అని నటుడు విజయకుమార్ తనయుడు అరుణ్ విజయ్ మొదటి సినిమాకు దర్శకత్వం వహించారు. రజనీకాంత్ గారితో అరుణాచలం, కమల్ హాసన్ తో శివం మాత్రమే కాక మరికొందరి నటులతో అనగా కార్తీక్, ప్రశాంత్, అర్జున్, శరత్ కుమార్, అజీత్ కుమార్ మొదలైనవారి చిత్రములకు దర్శకత్వం వహించారు.ఇయన తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన చిత్రం సమ్ థింగ్ సమ్ థింగ్ . 2006-వ సంవత్సరం అతని డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చి,తలై నగరం చిత్రముతో హీరోగా మారారు. ఆరంభ దశలో పరాజయం పొందినప్పటికీ తదుపరి ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. 2007-వ సంవత్సరం విడుదలైన వీరాప్పు సినిమానూ, 2008-వ సంవత్సరం విడుదలైన శండై సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి.
Also Read : IPL 2025 : సన్ రైజర్స్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన హీరో… నాకు సంబంధం లేదు అంటూ…