BigTV English

Chandrababu with Trump: ఏపీకి అమెరికా అధ్యక్షులు.. వైఎస్‌తో బుష్, చంద్రబాబుతో ట్రంప్

Chandrababu with Trump: ఏపీకి అమెరికా అధ్యక్షులు.. వైఎస్‌తో బుష్, చంద్రబాబుతో ట్రంప్

Chandrababu with Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏపీకి వస్తున్నారా? ఆయనకు సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతున్నారా? రాబోయే రోజుల్లో అలా జరుగుతుందా?  ఇది జరుగుతుందో లేదో తెలీదు. అలాంటివి కలలు కనడానికి బాగానే ఉంటాయి.  వాటిని ఏఐ వీడియో రూపంలో తీసుకొచ్చారు కొంతమంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హంగామా చేస్తోంది.


అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. రోజుకో కొత్త యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. టెక్ కంపెనీలు రోజుకో టెక్నాలజీని తెరపైకి తీసుకొస్తున్న రోజులివి. ఫోటోలు, వీడియోలు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాటిలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఒకటి. మానవుడి జీవితంలో ఎన్నో పనులను దీని ద్వారా సులభంగా చేయవచ్చు. ఇటీవల కాలంలో ఏఐ సాయంతో కొత్తగా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు.

లేటెస్ట్‌గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏపీ పర్యటనకు వస్తే ఎలా ఉంటుందో ఊహించిన ఏఐ ద్వారా వీడియో క్రియేట్ చేశారు కొందరు. చంద్రబాబు-ట్రంప్‌లు బీచ్‌లో నడుచుకుంటూ కొబ్బరి బోండాలు పట్టుకుని సరదాగా మాట్లాడుతున్నట్లుగా ఉంది. చంద్రబాబు సైకిల్ తొక్కుతుంటే వెనుక ట్రంప్ కూర్చుని రోడ్డుపై ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తున్నట్లుగా క్రియేట్ చేశారు.


వెనుకాల క్వానాయ్ వస్తున్నట్లు ఉంది. ట్రంప్ చిన్నారుల మధ్య గోలీకాయలు, బొంగరాల ఎంజాయ్ చేస్తున్నట్లు చేశారు. ఏపీలో గుమగుమలాడే రుచుల మధ్య ట్రంప్‌కు చంద్రబాబు పూతరేకుల్నిఅంద జేసినట్లుగా క్రియేట్ చేశారు. చివరలో ట్రంప్‌ను చంద్రబాబు రాజధాని అమరావతికి గుర్తుగా బుద్ధుడి ప్రతిమను అంద జేసినట్లు ఉంది. కేవలం 15 సెకన్ల నిడివి గల వీడియోను తిలకించిన తెలుగు తమ్ముళ్లు ఎంజాయ్ చేస్తున్నారు.

ALSO READ: కొండంత రాగం తీసి, గోశాల గొడవలో హైటెన్షన్

షేర్ చేసిన అభిమాని ట్రంప్ ఏపీకి వస్తే ఎలాంటి ఆతిధ్యం ఇస్తారనేది ఊహించిన ఏఐతో రూపొందించిన వీడియో మాత్రమే. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదని, కళాత్మక వ్యక్తీకరణ కోసం సృష్టించబడిందని రాసుకొచ్చారు.

దీనిపై కొందరు టీడీపీ నేతల వెర్షన్ మరోలా ఉంది. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఉన్న సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ హైదరాబాద్‌కు వచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయనతో వైఎస్ కొంత సేపు గడిపారని అంటున్నారు. ఆయన జీవితంలో అదొక మైలురాయిని అంటున్నారు. చంద్రబాబు-ట్రంప్ వీడియో చూస్తుంటే అప్పటి క్షణాలు గుర్తు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏపీకి వస్తారో లేదో తెలీదుగానీ మొత్తానికి క్రియేట్ చేసినవారి ఆలోచనలు అద్భుతమని అంటున్నారు.

 

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×