Thandel Pre Release Event.. గత కొన్ని నెలలుగా సక్సెస్ కోసం ఆరాటపడుతున్న అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) తాజాగా నటిస్తున్న చిత్రం తండేల్ (Thandel). ప్రముఖ లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేయగా.. విశేష స్పందన సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా నుండి విడుదలైన పాటలు గ్లింప్స్, పోస్టర్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్ననే నిర్వహించాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది.
అల్లు అర్జున్ తో పాటు సందీప్ రెడ్డి వంగా..
ఇక ఈరోజు ఘనంగా హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అందులో భాగంగానే పుష్పరాజ్ (Allu Arjun) ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పుష్పరాజ్ తో పాటు మరో డైరెక్టర్ కూడా చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈరోజు హైదరాబాదులో సాయంత్రం 5:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ‘యానిమల్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇక ఈ విషయం తెలిసి రాజుగాడి అదృష్టం మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ చేసే దిశగా మేకర్స్ భారీ ప్లాన్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే అల్లు అర్జున్తో పాటు సందీప్ రెడ్డి వంగాను కూడా రంగంలోకి దింపబోతుండడం గమనార్హం.
తండేల్ మూవీ విశేషాలు..
శ్రీకాకుళం మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య రాజు క్యారెక్టర్ లో, సాయి పల్లవి(Sai Pallavi) సత్యా పాత్రలో నటిస్తున్నారు. దేశభక్తితో ముడిపడిన అద్భుతమైన ప్రేమ కావ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వం వహిస్తూ ఉండగా.. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు (Bunny vasu) నిర్మిస్తున్నారు. ఇక అలాగే అల్లు అరవింద్(Allu Aravindh) సమర్పణలో ఈ సినిమా తెరకెక్కబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక మరొకవైపు నాగచైతన్య ఈ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకు అక్కినేని కుటుంబంలో ఏఎన్ఆర్ మినహా నాగార్జున మొదలుకొని నాగచైతన్య, అఖిల్ ఎవరు కూడా తమ సినిమాలతో రూ.100 కోట్లు రాబట్టలేదు. ఇప్పుడు యంగ్ హీరోలు కూడా రూ.100 కోట్ల మార్కెట్ను ఈజీగా చేరిపోతున్న నేపథ్యంలో నాగచైతన్య పై భారీ భారమే పడిందని చెప్పాలి. మరి ఈ సినిమాతో ఆ టార్గెట్ రీచ్ అవుతారో లేదో చూడాలి.