E-Paper
Advertisement

Sandeep Reddy Vanga : ఇది యానిమల్.. అది డెవిల్.. సందీప్ రెడ్డి వంగా షాకింగ్ స్టేట్మెంట్..

Sandeep Reddy Vanga : ఇది యానిమల్..  అది డెవిల్.. సందీప్ రెడ్డి వంగా షాకింగ్ స్టేట్మెంట్..
Advertisement
Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga : ఒకే ఒక చిత్రంతో సెన్సేషన్ సృష్టించి.. నెక్స్ట్ మూవీతో బీభత్సం చేయడానికి వస్తున్న డైరెక్టర్ సందీప్ వంగా. రీసెంట్ గా విడుదలైన అతని ‘యానిమల్’ మూవీ ట్రైలర్ చూసి.. ఇదేం ట్రైలర్ రా బాబోయ్.. ఇంత వైలెన్స్.. అంటూనే మరోపక్క మూవీ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న మహేష్ ఫ్యాన్స్.. ఇప్పుడు తెగ ఫీల్ అవుతున్నారు.

అసలు కథ ఏమిటంటే.. నిజానికి సందీప్ మహేష్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోకుండా అది పక్కన పెట్టేసి రణబీర్ కపూర్ తో యానిమల్ మూవీని స్టార్ట్ చేశాడు. దీంతో ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచి.. మహేష్ సందీప్ చేయాల్సిన మూవీ..యానిమల్ అని.. సందీప్ ఈ స్టోరీ ముందుగా మహేష్ కి చెప్పాడని.. అతను రిజెక్ట్ చేయడంతో రణబీర్ ను పెట్టి తీశాడని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీంతో కాస్త హర్ట్ అయిన మహేష్ అభిమానులు.. అన్న అసలు ఇలాంటి సినిమా ఎలా రిజెక్ట్ చేసావ్ అన్నా.. అని సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు. అయితే మరోపక్క నిజంగా సందీప్ మహేష్ కి చెప్పిన స్టోరీ ఇదేనా అన్న సందేహం కూడా అక్కడక్కడ వ్యక్తం అవుతుంది.

Advertisement

ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో యానిమల్ మూవీ టీం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న సందీప్ వంగా.. విలేకరులతో ఈ విషయం గురించి చర్చించారు. బయట వస్తున్న రూమర్స్ కి సమాధానం ఇస్తూ.. ‘మహేష్ బాబుకు చెప్పింది వేరే స్టోరీ.. ఇది కేవలం యానిమల్.. అది డెవిల్. స్టోరీ కాస్త ఈ మూవీ తరహాలో ఉంటుంది కానీ హీరో క్యారెక్టర్ దీనికంటే వైల్డ్ గా ఉంటుంది ‘అని అన్నాడు. అప్పుడెప్పుడో కబీర్ సింగ్ మూవీ రిలీజ్ ఎప్పుడు ఇంతకంటే వైరస్ చూపిస్తాను. అన్న సందీప్ వంగా.. అన్నమాట ప్రకారం వైలెన్స్ ఎట్ ఇట్స్ పీక్స్ గా యానిమల్ తో రచ్చ పుట్టిస్తున్నాడు.

ఇప్పుడు ఇంతకంటే వైల్డ్ గా మహేష్ బాబును చూపిస్తాను అనడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే కొన్ని కారణాలవల్ల సినిమా సెట్స్ పైకి వెళ్లలేదని.. ఫ్యూచర్లో ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం ఉందని వెల్లడించాడు. దీంతోపాటుగా ఒకవేళ యానిమల్ మూవీ ని తెలుగులో చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు అని అడిగిన ప్రశ్నకి ఆలోచించకుండా మహేష్ బాబు అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతానికి మహేష్ అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు.

Advertisement

‘యానిమల్’ మూవీ డిసెంబర్ 1న పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×