BigTV English

Porn video in office : ఆఫీస్‌లో పోర్న్ వీడియో.. బారులు తీరిన జనం.. ఎక్కడంటే?

Porn video in office : ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది. తక్కువ ధరకే ఇంటర్నెట్ డాటా దొరకడంతో పోర్న వీడియో చూసేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. భారతదేశంలో మొత్తం ఇంటర్నెట్ వాడకంలో 30 శాతం పోర్న్ వీడియోలకే వినియోగమవుతోందని పలు నివేదికలు చెబుతున్నాయి.

Porn video in office :  ఆఫీస్‌లో పోర్న్ వీడియో.. బారులు తీరిన జనం.. ఎక్కడంటే?

Porn video in office : ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది. తక్కువ ధరకే ఇంటర్నెట్ డాటా దొరకడంతో పోర్న్ వీడియో చూసేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. భారతదేశంలో మొత్తం ఇంటర్నెట్ వాడకంలో 30 శాతం పోర్న్ వీడియోలకే వినియోగమవుతోందని పలు నివేదికలు చెబుతున్నాయి.


దీంతో పోర్న్ వీడియోలు ఒక వ్యసనంగా మారుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా పోర్న్ వీడియోలు చూసే దేశాలలో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా పోర్న్ వీడియోలు చూసే అయిదు దేశాలు.. పాకిస్తాన్, ఈజిప్ట్, వియత్నాం, ఇరాన్, మొరాక్కో.

తాజాగా పాకిస్తాన్‌లో ఒక పోర్న్ వీడియో ఘటన కలకలం రేపింది. పాకిస్తాన్‌లో చాలా మంది యూరప్, అమెరికా దేశాలకు వలస వెళుతున్నారు. దీనికోసం అమెరికా, యూకె ఎంబసీ ఆఫీసులకు వీసాల కోసం బారులు తీరుతున్నారు.


ఇటీవల పాకిస్తాన్ యూకె వీసా ఆఫీస్‌లో భారీగా జనం ఉన్న సమయంలో అక్కడ వెయిటింగ్ హాల్‌లో ఒక్కసారిగా పోర్న్ వీడియోలు టీవిలో దర్శనమిచ్చాయి. జనమంతా అది చూసి ఆశ్చర్య పోయారు. ఒకటి కాదు రెండు వీడియోలు టీవిలో నడిచాయి. వీసా కోసం ఒక పెద్ద లైన్‌లో నిలబడి ఉన్న జనం ఆ టీవిలవైపు తమ టోకెన్ నెంబర్ కోసం చూస్తుండగా.. ఈ అశ్లీల వీడియోలు కనిపించాయి.

కాసేపు తరువాత ఆఫీసు సిబ్బంది అది గమనించి టీవిలు స్విచాఫ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆఫీసులో ఉద్యోగులే పోర్న్ వీడియోలు చూస్తూ.. పొరపాటున ఆఫీసు టీవికి కనెక్షన్ ఇవ్వడంతో ఇలా జరిగిందని సమాచారం.

ఇలాంటి ఘటనే కొన్ని నెలల క్రితం భారతదేశంలోని పట్నా నగరం రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైల్వే స్టేషన్‌లో ట్రైన్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్న రైల్వే యాత్రికులకు అక్కడి టీవిలో పోర్న్ వీడియోలు కనిపించాయి. అప్పటి నుంచి పట్నా రైల్వే స్టేషన్‌లో వైఫై సేవలు నిలిపివేయబడ్డాయి.

కొంత మంది ఉద్యోగులు పోర్న్ వీడియోలను ఆఫీసులోనూ చూస్తున్న చాలా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల భారతదేశంలో పార్లమెంటులో ఒక లోకసభ సభ్యుడు పోర్న్ వీడియో చూస్తుండగా.. ఒక కెమెరాకి చిక్కాడు.

ప్రపంచంలో అత్యధికంగా ఇలాంటి ఘటనలు చైనా దేశంలో జరుగుతున్నాయి. చైనీయులు ఎక్కువగా ఆఫీసు పనివేళల్లో పోర్న్ వీడియోలు చూస్తున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×