BigTV English

Polar Wolf Arctic Prison : పోలార్ వుల్ఫ్‌లో నిర్బంధం నరకమే..!

Polar Wolf Arctic Prison : పోలార్ వుల్ఫ్‌లో నిర్బంధం నరకమే..!

Polar Wolf Arctic Colony : సైబీరియాలోని పీనల్ కాలనీ(జైలు)కి వచ్చిన మూడు నెలల్లోపే నావల్నీ మృతి చెందారు. గత డిసెంబర్ లో ఆయనను అత్యంత రహస్యంగా పోలార్ వుల్ఫ్ జైలుకి తరలించారు. రష్యాలోనే అత్యంత కఠిన కారాగారాల్లో ఇదొకటి. ఇక్కడ నుంచి తప్పించుకోవడం దుర్లభం. తీవ్రవాదం ఆరోపణలపై 2021లో ఆయనకు 19 ఏళ్ల జైలు శిక్ష పడింది.


3 వారాలకు వెల్లడి

మాస్కోకు ఈశాన్యంగా 1900 కిలోమీటర్ల దూరంలో యమల్-నెనెత్స్ రీజియన్లోని ఖార్ప్ పట్టణంలో ఉందీ జైలు. నావల్నీ ఆచూకీ తెలియడం లేదన్న వార్తలు డిసెంబర్‌లో గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో నావల్నీని ఈ జైలుకే తరలించారన్న విషయం మూడువారాల పాటు బయటి ప్రపంచానికి వెల్లడి కాలేదు.


ఎన్నికల నేపథ్యంలోనే ఏకాంతవాసం

న్యాయవాదులు 618 సార్లు వినతులు అందజేసిన తర్వాతే నావల్నీని పోలార్ వుల్ఫ్ జైలులో ఉంచినట్టు తెలిసింది. రష్యాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. నావల్నీని అత్యంత దుర్భరమైన ఏకాంత ప్రదేశానికి తరలించినట్టు అప్పట్లోనే వార్తలొచ్చాయి. ఇక్కడ ఖైదు అంటే నరకప్రాయమే.

శీతాకాలం.. అత్యంత దుర్భరం

ఆర్కిటిక్ సర్కిల్‌కు 60 కిలోమీటర్ల ఎగువన ఉన్న ఈ జైలు 1960లో ఆరంభమైంది. ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిని ఐకే-3 పీనల్ కాలనీకి తరలిస్తారు. శీతాకాలంలో ఇక్కడ పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉంటాయి.

సమాచారమూ ఉండదు

ఉష్ణోగ్రతలు మైనస్ 28 సెల్సియస్ డిగ్రీలకు పడిపోతాయి. ఇలా వారాల పాటు గడ్డకట్టే శీతల వాతావరణం కొనసాగుతుంది.

పీనల్ కాలనీకి చేరుకోవడం చాలా కష్టం. ఆఖరికి ఉత్తరాలు పంపాలన్నా అసాధ్యమే. ఐకే-3 పీనల్ కాలనీలో సరైన దుస్తులు ఇవ్వరని, గడ్డ‌కట్టే చలిని చవిచూడాల్సి వస్తుందని మాజీ ఖైదీలు చెబుతుంటారు.

ఖైదీలకు వసతులు కరువే

తానిక్కడ అడుగు పెట్టినప్పుడు ఒక జత వింటర్ బూట్లు, చిరిగిపోయిన కోటును మాత్రమే ఇచ్చారని మాజీ ఖైదీ మాగ్జిం బఖ్ వలోవ్ తెలిపారు. వేసుకునేందుకు కూడా వీలు కాని దుస్తుల వల్ల తరచూ అనారోగ్యానికి గురయ్యాయని, కొత్తవి అడిగినా జైలు అధికారులు పట్టించుకోరని మరొక ఖైదీ తెలిపారు.

వేడినీళ్లూ ఇవ్వరు..

గాలి, వెలుతురు లేని చీకటి గుయ్యారాల్లో శిక్ష అనుభవించాలని, వేడినీళ్లు సైతం కరువేననేది మరొక ఖైదీ అనుభవం. ఇక ఇక్కడ పెట్టే చిత్రహింసల గురించి చెప్పనలవి కాదని మరికొందరు చెబుతారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×