BigTV English

Spirit Movie: ప్రభాస్ వర్సెస్ డాన్ లీ కన్ఫర్మ్ చేసిన సందీప్.. ఎడిట్స్ మొదలెట్టండిరోయ్..

Spirit Movie: ప్రభాస్ వర్సెస్ డాన్ లీ కన్ఫర్మ్ చేసిన సందీప్.. ఎడిట్స్  మొదలెట్టండిరోయ్..

Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది కల్కి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డార్లింగ్.. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఇది పూర్తి అయ్యిన వెంటనే స్పిరిట్ సెట్ లో ప్రత్యేక్షం కానున్నాడు. టాలీవుడ్ మాత్రమే కాదు..  ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.


అనిమల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.  ఎప్పుడెప్పుడు ఈ సినిమా పట్టాలెక్కిద్దా.. ? అని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సందీప్ ఎక్కడ కనిపించినా.. అది ఏ ఈవెంట్.. ? ఎందుకు  వచ్చాడు.. ? అనేది కూడా చూడకుండా స్పిరిట్ అప్డేట్.. అప్డేట్ అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తూనే ఉన్నారు.

BB Telugu 8 Promo: విన్నర్ ఎవరో తేల్చేసిన శివాజీ.. సంతోషంలో ఫ్యాన్స్..!


ఇక ఆ రచ్చ తట్టుకోలేక సందీప్.. తప్పక ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నాడు.  ఒక ఈవెంట్  లో డిసెంబర్ లో స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పాడు. ఆ తరువాత  స్పిరిట్ కాప్ గా నటిస్తున్నాడని చెప్పాడు.  ఇక ఈ మధ్య కొరియన్ నటుడు  డాన్ లీ.. స్పిరిట్ లో నటిస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ .. డాన్ లీ, ప్రభాస్ నటించిన సలార్ సినిమా చూస్తున్నట్లు ఒక పోస్ట్ పెట్టాడు.

ఇంకేముంది సోషల్ మీడియా దద్దరిల్లింది. ప్రభాస్ వర్సెస్ డాన్ లీ అంటూ కన్ఫర్మ్ చేసేశారు. ఇక తాజాగా వార్తలపై సందీప్ కూడా స్పందించాడు. నేడు ఒక ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా కలిసి పాల్గొన్నారు. ఈ ఈవెంట్ అయ్యేవరకు కామ్ గా ఉన్న ఫ్యాన్స్  చివర్లో స్పిరిట్ అప్డేట్  అడిగారు.

Nayanthara: ధనుష్ పరువు బజారుకీడ్చడమే నయన్ ప్లానా.. ?

స్పిరిట్ లో కొరియన్ నటుడు డాన్ లీ అని వార్తలు వినిపిస్తున్నాయి.. అప్డేట్ ఎప్పుడు ఇస్తారు అని అడగ్గా.. సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. ” మొత్తం, అన్ని అప్డేట్ ఇస్తా.. త్వరలో స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా  అన్ని ఇస్తా” అని చెప్పుకొచ్చాడు. అప్డేట్ ఇస్తాను అన్నాడు కానీ.. డాన్ లీ లేడు అని చెప్పలేదు.. అయితే కచ్చితంగా డాన్ లీ ఉన్నట్లే. ఇక వీరిద్దరి ఎడిట్స్ మొదలుపెట్టండి రోయ్ అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఒకవేళ  ఇదే కనుక నిజమైతే.. అసలు ఈ సినిమాను కొట్టే సినిమా ఇంకొకటి లేదనే చెప్పాలి. మరి సందీప్ స్పిరిట్ ను ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×