Thandel Pre Release Event: తెలుగు ప్రేక్షకులను రియల్ లైఫ్ స్టోరీ తో మెప్పించడానికి సిద్ధం అయ్యారు సాయి పల్లవి(Sai Pallavi) , నాగచైతన్య (Naga Chaitanya). అందులో భాగంగానే వీరు కలిసి నటించిన చిత్రం తండేల్ (Thandel). శ్రీకాకుళం మత్స్యకారుల నిజజీవితంలో జరిగిన సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం హైదరాబాదులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. ఇకపోతే ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్(Allu Arjun) తో పాటు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) చీఫ్ గెస్ట్ గా వస్తారనుకున్నారు. కానీ అల్లు అర్జున్ ఈవెంట్ కి రాలేదు. కారణాలు తెలియదు కానీ అల్లు అర్జున్ అభిమానులను మాత్రం ఈ విషయం కాస్త డిసప్పాయింట్ చేసే విషయమని చెప్పవచ్చు. ఇకపోతే ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
చైతు బట్టలే నా సినిమాలకు రిఫరెన్స్..
ఈ క్రమంలోనే తన సినిమాలకు చైతూ బట్టలే రిఫరెన్స్ అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇకపోతే తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ పై సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. “నేను కేడీ సినిమాకి పనిచేసినప్పుడు చైతూ ఎక్కువగా షూటింగ్ కి వచ్చేవారు. అయితే ఆయనంటే ఎందుకో మరి అప్పటి నుండే మంచి అభిప్రాయం ఏర్పడింది.ఇంతకుముందే నేను ఈ విషయం శివా నిర్వాణ (Siva Nirvana) తో కూడా తెలిపాను. కొంతమందితో మనకు పరిచయం లేకపోయినా వారి మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అలాంటి వారిలో నాగచైతన్య ఒకరు.. మీరు రియల్ లైఫ్ లో వేసుకునే బట్టలు, మీరు వాడే లంబోర్ఘిని కారు నడిపే విధానం ఇవన్నీ కూడా నాకు ఎంతో ఇష్టం. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నేను దర్శకత్వం వహించిన కబీర్ సింగ్, యానిమల్ సినిమాలలో.. నేను నా కాస్ట్యూమ్ డిజైనర్ కి మీరు రియల్ లైఫ్ లో వేసుకునే బట్టలనే రిఫరెన్స్ గా చూపించాను. ఇప్పటివరకు ఈ విషయాన్ని చెప్పలేదు ఇప్పుడు చెబుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు” సందీప్ రెడ్డి వంగా. ఇక సందీప్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఒక వ్యక్తిని ఇన్స్పైర్ అయ్యి బ్లాక్ బాస్టర్ విజయాలు సొంతం చేసుకున్నారు అంటూ అటు చైతూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తండేల్ సినిమా విశేషాలు..
కార్తికేయ 2 సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చందు మొండేటి (Chandu Mondeti) ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులలో విపరీతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఫిబ్రవరి 7వ తేదీన నాగచైతన్య తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి వారి కోరిక మేరకు ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందో లేదో చూడాలి.