Road Accident in Chittoor: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరి నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేటు బస్సును.. లారీ ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలోని నగరి సమీపంలో ఆదివారం 10 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బస్సును ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. 14 మందికి పైగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. తమిళనాడు అరక్కోణం నుంచి తిరుపతికి ఓ ట్రావెల్ బస్సు బయల్దేరింది. నగరి సమీపంలోకి రాగానే బస్సు డ్రైవర్ మరో వాహనాన్ని అధికమించేందుకు ప్రయత్నించి ఎడమ వైపు తిప్పుతుండగా.. ఇంతలో ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ బస్సును ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని ప్రయాణికులంతా ఎగిరి రోడ్డు మీద పడ్డారు.
మృతి చెందిన వారిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలానికి చెందిన పార్థసారథి నాయుడుతో పాటు, రాజేంద్ర నాయుడు మృతి చెందారు. వీరిద్దరు తమిళనాడులోని తిరుత్తణిలో ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు.. తిరుపతికి చెందిన ధనుష్(10), తమిళనాడుకి చెందిన కుమార్ ప్రాణాలు కోల్పోయారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణమైన లారీతో పాటు డ్రైవర్ పారిపోయాడని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు.
Also Read: భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు దుర్మార్గులు – నమ్ముకున్న స్నేహితులే నిందితులు
ఈ ఘటనలో మృతి చెందిన టీడీపీ నేతలు ఇద్దరు.. ఆదివారం నాడు తమ ఊరి తరుపున అమరావతి నిర్మాణానికి విరాళాన్ని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అందించారు. అనంతరం తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు వెళ్లి.. తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై టీడీపీ నేతలు, ఎమ్మెల్యే భాను ప్రకాష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో గాయపడిన వారు.. తిరుపతికి చెందిన శెల్వి, భరత్, చెన్నామల్లే, శివగిరికి చెందిన అనురాధ, తిరువళ్లూరుకు చెందిన వి. వెట్రివేల్, రుద్రమూర్తి, ఎస్. సుధాకర్, తాడిపత్రికి చెందిన ఎ.రాధాకృష్ణ, ఎ. నాగేంద్ర, సుబ్బనరసమ్మగా పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉంటే.. మార్టూరులో జాతీయ రహదారిపై..ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి సత్తెనపల్లికి బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. వెంటనే క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.