Tollywood:ఒకప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ అంతా కూడా తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కాలంలో కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న కారణంగా పాత హీరోయిన్స్ అందరూ దాదాపు ఇండస్ట్రీకి దూరమయ్యారనే చెప్పాలి. ఇక సినిమాలు లేక, అవకాశాలు రాక కొంతమంది ఇండస్ట్రీకి దూరమైతే.. మరి కొంతమంది ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక అలా ఇండస్ట్రీకి దూరమైన ఎంతోమంది హీరోయిన్స్ తమ తమ వ్యక్తిగత జీవితాలలో బిజీ అయినా విషయం తెలిసిందే. ఇకపోతే అలా వ్యక్తిగత జీవితానికే పరిమితమైన ఎంతోమంది హీరోయిన్స్,మళ్ళీ మీడియా ముందు కనిపిస్తే వారి అభిమానుల సంతోషం మామూలుగా ఉండదు. అలా ఒక హీరోయిన్ మీడియా ముందుకు వస్తేనే ఉబ్బితబ్బిబ్బయ్యే ఆడియన్స్ .. అందరూ కలిసి ఒకేసారి కనిపిస్తే.. ఇక వారి ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.
Balakrishna : బోయపాటి న్యూ ప్లానింగ్… పార్ట్ 3 కూడా ఉందా?
రీల్ చేసిన సీనియర్ ముద్దుగుమ్మలు..
అయితే అనూహ్యంగా ఆ స్టార్ హీరోయిన్స్ అందరూ ఒకే చోట సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా అలరించిన మీనా(Meena ), సంగీత (Sangeetha), మహేశ్వరి (Maheswari) ఒకే చోట చేరి.. ఒక మాస్ రీల్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. సీనియర్ హీరోయిన్స్ అయిన మీనా, సంగీత, మహేశ్వరి ముగ్గురూ కలిసి ఒక మ్యూజిక్ కి సరదాగా రీల్ చేశారు. ముగ్గురు కూడా ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేసి ఈ రీల్ షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ప్రభుదేవా ఈవెంట్లో మెరిసిన సీనియర్ హీరోయిన్స్..
ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం రోజా, మీనా, రంభ, నగ్మా, మహేశ్వరి, సంగీత ఇలా పలువురు స్టార్ హీరోయిన్స్ అంతా కలిసి చెన్నైలో ప్రభుదేవా (Prabhudeva) నిర్వహించిన లైవ్ డాన్స్ ఈవెంట్లో కనువిందు చేశారు. అప్పుడు వీరంతా కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇలా సీనియర్ హీరోయిన్స్ అందరూ ఒకే చోట చేరి అభిమానులకు మంచి వినోదాన్ని అందించారని చెప్పవచ్చు. ఇకపోతే ఈ రీల్ లో కనిపించిన మీనా ఇప్పటికీ సినిమాలు, టీవీ షో లతో బిజీగానే ఉంది. అటు సంగీత కూడా సినిమాలు, టీవీ షోలు చేస్తూ తన కెరీర్ ను బిజీగా కొనసాగిస్తోంది. అయితే మహేశ్వరి మాత్రం సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వకపోయినా.. అటు తమిళ్ టీవీ షోలలో మాత్రమే అలరిస్తోంది అని చెప్పవచ్చు. ఇక వీరంతా కూడా ఒకప్పుడు వరుస సినిమాలతో.. స్టార్ హీరోల సరసన నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ అయిపోవడంతో వీరికి అవకాశాలు ఇవ్వడానికి ఇప్పుడున్న డైరెక్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరిపెట్టుకుంటున్న ఈ హీరోయిన్స్ అప్పుడప్పుడు టీవీ షోలలో కూడా సందడి చేస్తూ ఉంటారు.