Sangeeth Shobhan..సాధారణంగా ఒకే కుటుంబం నుండి వారసులు ఇద్దరు లేదా అంతకుమించి ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. అయితే తల్లిదండ్రుల వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన వారసులంతా కూడా.. సక్సెస్ అవుతున్నారా అంటే.. లేదనే చెప్పాలి. అందులో మొదట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు సక్సెస్ కావచ్చు.. లేదా వారి తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు సక్సెస్ కావచ్చు. ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకులు ఈవివి సత్యనారాయణ (EVV.Sathyanarayana) వారసులు ఆర్యన్ రాజేష్(Aryan Rajesh), అల్లరి నరేష్(Allari Naresh) ఇద్దరూ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే అల్లరి నరేష్ కంటే ఆర్యన్ రాజేష్ పెద్ద స్టార్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. రాజేష్ కంటే నరేష్ చాలా పెద్ద స్టార్ అయిపోయారు. ప్రధాన పాత్రల్లో కమెడియన్ గా నటించి, తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న నరేష్ ఇప్పుడు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ.. అటు కమెడియన్ గా ఇటు హీరోగా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
Pooja Hegde: హీరోయిన్స్ కి ఇచ్చే క్యారెక్టర్స్ పై పూజా అసహనం.. ముందే తెలియదా అంటూ
అల్లరి నరేష్ లా మారిన సంగీత్ శోభన్..
అయితే ఇప్పుడు ఈయన లాగే తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సంగీత్ శోభన్ (Sangeeth Shobhan). పైగా సంగీత్ శోభన్ కి సంతోష్ శోభన్ (Santhosh Shobhan) అనే అన్నయ్య కూడా వున్నారు. ఈయన కూడా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఇప్పుడు సంగీత్ అందుకున్నటువంటి స్టేటస్ ను ఆయన అన్నయ్య సొంతం చేసుకోలేకపోయారు. సంగీత్ శోభన్ ‘మ్యాడ్’ సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని.. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాతో మరో ఇమేజ్ అందుకున్నారు అని చెప్పవచ్చు. అంతేకాదు మెగా వారసురాలు నిహారిక (Niharika) నిర్మాణంలో కూడా సంగీత్ శోభన్ ఒక సినిమా ఇటీవల చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇది కాగా కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ బేస్ చేసుకుని రాసుకున్న కథలే ఇవన్నీ అని చెప్పవచ్చు. దీంతో నరేష్ ప్లేస్ ను సంగీత శోభన్ రీప్లేస్ చేసినట్లు అనిపిస్తోంది. కొంత కాలం పాటు సంగీత్ కామెడీ ప్రేక్షకులకు కనెక్ట్ కనెక్ట్ అయ్యేలా అనిపిస్తోంది. ముఖ్యంగా రవితేజ (Raviteja) మాస్ కామెడీ, నరేష్ కామెడీ వర్కౌట్ అయినంతగా ఇప్పుడు సంగీత్ కి కూడా అదే కామెడీ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.
అన్నయ్యల కథ కంచికేనా..?
పైగా.. ఇండస్ట్రీలో కామెడీ ప్రధానంగా సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఈ ట్రెండ్ మారనంత వరకు కూడా సంగీత్ సినిమాలు చేసుకోవచ్చు. కానీ ట్రెండ్ మారితే మాత్రం తాను కూడా అల్లరి నరేష్ లాగే విభిన్నమైన పాత్రలు పోషించాల్సి ఉంటుంది. సంగీత్ అన్నయ్య సంతోష్ శోభన్ కూడా హీరోగా సక్సెస్ అవుతారని అందరూ అనుకున్నారు కానీ సంతోష్ మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. మొత్తానికైతే సంగీత్ శోభన్, సంతోష్ శోభన్లను చూస్తే వీరిద్దరి అన్నదమ్ముల కథ కూడా అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ స్టోరీ లా మారుతుందేమో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. ఏది ఏమైనా వీరిద్దరూ వారిద్దరిలా మారిపోయి.. అన్నయ్యల కథ కంచికే అన్నట్టుగా పరిస్థితి మారొచ్చేమో అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.