Sanjana Galrani.. ప్రముఖ కన్నడ బ్యూటీ సంజన గల్రానీ (Sanjana Galrani) గత కొన్ని రోజుల క్రితం సినీ ఇండస్ట్రీలో తనను ఒక నటుడు ఇబ్బంది పెట్టాడు అంటూ చెప్పి వార్తల్లో నిలిచింది. ఇక ఆ వార్తల నుంచి ఇంకా అభిమానులు బయటపడక ముందే మళ్లీ ఇప్పుడు ఈమె కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే, సంజన గల్రానీ డ్రగ్స్ కేసులో గతంలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.అంతే కాదు మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన ఈమె, బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇక సంజన అరెస్ట్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేస్ అప్పీల్..
ఇటీవల ఆ డ్రగ్స్ కేసును అక్కడి హైకోర్టు కొట్టివేసింది. అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సీసీబీ పోలీసులు ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. దీని వల్ల సంజన మళ్లీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో ఒక సమావేశం నిర్వహించగా, అప్పీల్ కు సంబంధించిన పిటిషన్ ని కూడా సిద్ధం చేశారట. ప్రాసిక్యూషన్ అనుమతి లభించిన వెంటనే పిటిషన్ దాఖలు చేస్తామని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. ఏది ఏమైనా ఇప్పుడే జైలు జీవితం నుండి బయటపడి కుటుంబంతో సంతోషంగా ఉన్న సంజన మళ్లీ అదే కేసులో ఇరుక్కొని జైలు జీవితం గడపబోతుందేమో అని అనుమానాలతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు సంజనా కు ఇంకా ఎన్నాళ్ళు ఈ జైలు జీవితం అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ విషయంపై సంజన ఎలా స్పందిస్తుందో చూడాలి.
సంజన సినిమాలు..
సంజన సినిమాల విషయానికి వస్తే.. 2005లో తరుణ్(Tarun ) హీరోగా నటించిన ‘సోగ్గాడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas ) నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ అందుకుంది. ఇక ఆ తర్వాత రాజశేఖర్ (Rajasekhar) నటించిన ‘సత్యమేవ జయతే’, శ్రీకాంత్ (Srikanth) హీరోగా నటించిన ‘దుశ్శాసన’, , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’, అవును 2,యమహో యమ, ముగ్గురు వంటి చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. ఇక అలా కన్నడ, తమిళ్, తెలుగు చిత్రాలలో నటించింది. ఇక కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకొని ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ముఖ్యంగా 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో బెంగళూరుకు చెందిన అజీజ్ పాషా అనే ఒక వైద్యుడిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కొడుకు పుట్టడంతో..ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తోంది ఇలాంటి సమయంలోనే ఈమె డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో సంచలనం సృష్టిస్తోందని చెప్పవచ్చు. ఏది ఏమైనా సంజన గల్రానినీ ఈ డ్రగ్స్ వ్యవహారం ఇంకా ఇప్పుడే వదిలిపెట్టేలా లేదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక సంజన సోదరి నిక్కీ గల్రానీ కూడా నటి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈమె తన సహ నటుడు ఆది పినిశెట్టిని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.