BigTV English

Urvashi Rautela: రిహార్సల్స్‌లో అంతా బాగానే ఉంది.. ‘దబిడి దిబిడి’ కాంట్రవర్సీపై ఊర్వశి రియాక్షన్

Urvashi Rautela: రిహార్సల్స్‌లో అంతా బాగానే ఉంది.. ‘దబిడి దిబిడి’ కాంట్రవర్సీపై ఊర్వశి రియాక్షన్

Urvashi Rautela: ఈరోజుల్లో చాలామంది ప్రేక్షకులకు ఏది నచ్చకపోయినా అది సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వక తప్పడం లేదు. అలా ఎక్కువగా ట్రోల్ అయితే దానిపై సినీ సెలబ్రిటీలు స్పందించక కూడా తప్పడం లేదు. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) సినిమాలో ‘దబిడి దిబిడి’ పాట కూడా అదే పరిస్థితి ఎదుర్కుంది. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో విడుదలయినప్పటి నుండే దీనిపై ట్రోల్స్ మొదలయ్యాయి. కానీ అవి ట్రోల్స్ అని అర్థం కాని ఊర్వశి.. వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పుడు మొదలయిన ట్రోల్స్.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉండగా తాజాగా మరోసారి దీనిపై స్పందించింది ఊర్వశి రౌతెలా.


ట్రోల్స్‌పై రియాక్షన్

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా.. ఇప్పటికే తెలుగులో పలు ఐటెమ్ సాంగ్స్‌లో కనిపించింది. తను చేసిన ప్రతీ ఐటెమ్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతో కలిసి స్టెప్పులేసింది. అలాగే ‘డాకు మహారాజ్’లో బాలయ్యతో కలిసి దబిడి దిబిడి పాటలో స్టెప్పులేసే ఛాన్స్ వచ్చినప్పుడు కూడా వెంటనే ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. అది తన కెరీర్‌కు పెద్ద ప్లస్ అవుతుంది అనుకుంది. ప్రేక్షకులు పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటారని అనుకుంది. కానీ అలా జరగలేదు. ప్రశంసల కంటే ఈ పాటకు ట్రోల్సే ఎక్కువగా వచ్చాయి. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో ఈ ట్రోల్స్‌పై స్పందించిన ఊర్వశి.. మరోసారి దీని గురించి రియాక్ట్ అయ్యింది.


ఇది నాలుగోసారి

‘‘దబిడి దిబిడి అనేది నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఫ్యాన్స్ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా చేశారు. ప్రతీ లిరిక్ వారి మైండ్‌సెట్‌కు తగినట్టుగా ఉంటుంది. రిహార్సల్స్ వీడియోలు చూసినప్పుడు కూడా అంతా బాగానే ఉంది అనిపించింది. ప్రతీ పాటకు ఎలా కొరియోగ్రాఫీ జరుగుతుందో దీనికి కూడా అలాగే జరిగింది. శేఖర్ మాస్టర్‌తో నేను ఇంతకు ముందు కూడా కలిసి పనిచేశాను. ఇది నాలుగో సారి ఆయనతో కలిసి పనిచేయడం. అందుకే ఆయన కొరియోగ్రాఫీ చూసి షాక్ అవ్వడం గానీ, ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నాం అని గానీ నాకు అనిపించలేదు. రిహార్సల్స్ సమయంలో అంతా కంట్రోల్‌లోనే ఉన్నట్టుగా అనిపించింది’’ అంటూ రిహార్సల్స్ రోజులను గుర్తుచేసుకుంది ఊర్వశి రౌతెలా.

Also Read: బాలయ్యతో ఢీ కి సిద్ధం అంటున్న యాక్షన్ సంచలనం.. ఎవరంటే?

ఆశ్చర్యంగా అనిపించింది

‘‘లిరికల్ వీడియో విడుదలయిన తర్వాత అంతా సడెన్‌గా జరిగిపోయింది. కొరియోగ్రాఫీపై ప్రేక్షకులంతా ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అందరూ ఇలా రిసీవ్ చేసుకుంటారని అనుకోలేదు. రిహార్సల్స్ మాత్రం ప్లానింగ్‌తోనే జరిగింది. ఇది ఒక మంచి మాస్ సాంగ్ అని ప్రేక్షకులు ఫీలవుతారని అనుకున్నా కానీ అదంతా వేరేలాగా తీసుకున్నారు’’ అంటూ ప్రేక్షకుల రియాక్షన్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది ఊర్వశి రౌతెలా (Urvashi Rautela). ‘దబిడి దిబిడి’ (Dabidi Dibidi) పాటకు అంతలా నెగిటివిటీ రావడానికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీనే కారణం. ఆయన కొరియోగ్రాఫ్ చేసిన స్టెప్పులు చూసి ప్రేక్షకులంతా షాకయ్యారు. మొత్తానికి ఈ స్టెప్పులకు వచ్చిన నెగిటివిటీ చూసి దీనిని సినిమాలో నుండి తీసేశారు మేకర్స్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×