Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ మూవీస్ గురించి తన ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అందులో ఒకటి ‘హరి హర వీరమల్లు’. చాలాకాలంగా ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేదు. మొత్తానికి ఇంతకాలానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ షూటింగ్‌లో జాయిన్ అయ్యారని ఇటీవల అప్డేట్ అందించారు మేకర్స్. పవన్ సైతం తాను ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొంటున్నట్టుగా ప్రకటించారు. ఇక మూవీ షూటింగ్ ప్రారంభమయ్యింది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన మొదటి లిరికల్ సాంగ్ బయటికి వచ్చింది. పాట అంతా బాగానే ఉన్నా పవన్ కళ్యాణ్ వాయిస్ మాత్రమే ఏదో తేడాగా ఉందేంటి అని విన్న ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
స్పెషల్ సాంగ్
‘హరి హర వీరమల్లు’లో మాట వినాలి అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో తాజాగా విడుదలయ్యింది. ‘‘ఏం గురాయించి చూస్తున్నావ్? బయపెట్టడానికా? నారాజ్ అయినవా? చాలామందిని చూసినాంలే బిడ్డ. మన లెక్క తెల్వద్. వినాలి.. వీరమల్లు మాట చెప్తే వినాలి’’ అనే డైలాగ్‌తో ‘మాట వినాలి’ సాంగ్ మొదలవుతుంది. మామూలుగా పెద్దవాళ్లు చెప్పే మాట వినకపోతే మంచిది కాదనే సామెతను అందరూ వినే ఉంటారు. అదే సామెతను కాస్త పాటగా మార్చి ‘హరి హర వీరమల్లు’లో చేర్చారు మేకర్స్. ఇక ఈ పాటకు పవన్ కళ్యాణ్ వాయిస్ అందించడం వల్ల సాంగ్‌పై అప్పుడే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.
ఎవరికి కౌంటర్?
‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) నుండి మాట వినాలి అనే పాట విడుదవుతుంది అని మేకర్స్ ప్రకటించిన వెంటనే ఈ పాట ఎవరికో ఇన్‌డైరెక్ట్ కౌంటర్‌లాగా అనిపిస్తుందే అని ప్రేక్షకుల్లో అనుమానం మొదలయ్యింది. ఇక తాజాగా విడుదలయిన పాట మొత్తం విన్న తర్వాత నిజంగా ఇది మాట వినని వాళ్లకు కౌంటర్‌లాగానే ఉందని ఫిక్స్ అయిపోతున్నారు. ఈ పాటలో మధ్యలో వచ్చే ‘‘మాట దాటిపోతే.. మర్మము తెలియకపోతే పొగరుబోతు తగురుపోయి కొండను తాకినట్టు’’ అనే లిరిక్ మాత్రం కచ్చితంగా ఎవరికో పర్సనల్‌గా సలహా ఇస్తున్నట్టుగానే ఉందని అప్పుడే కామెంట్స్ మొదలయ్యాయి. మొత్తానిక ‘మాట వినాలి’ అనే పాటతో ‘హరి హర వీరమల్లు’కు ఒక రేంజ్‌లో ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్.
Also Read: మిస్టరీ వీడింది.. పోలీసులకు చిక్కిన ‘గేమ్ ఛేంజర్’ పైరసీ బ్యాచ్..
అదే తేడా
పవన్ కళ్యాణ్ ఇంతకు ముందుకు కూడా తను నటించిన పలు సినిమాల్లో పాటలు పాడారు. ‘జానీ’ మూవీ నుండి ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. పవన్.. తాను నటించిన సినిమాల్లో ఒక జానపద గీతాన్ని ఆలపిస్తే అది కచ్చితంగా హిట్ అవుతుందనే సెంటిమెంట్ కూడా ప్రేక్షకుల్లో క్రియేట్ అయ్యింది. అలాగే ‘హరి హర వీరమల్లు’లో కూడా మాట వినాలి పాటను ఆలపించారు కానీ ఈ పాటను ఆయన కాకుండా ఇంకెవరైనా ప్రొఫెషనల్ సింగర్ పాడితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.