Sankranthiki Vasthunnam:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ (Venkatesh) ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక చివరిగా తన 75వ చిత్రంగా ‘సైంధవ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్.. ఈ సినిమాతో డిజాస్టర్ ను చవిచూశారు. తన 75వ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలనుకున్న వెంకటేష్ బొక్క బోర్ల పడ్డారని చెప్పాలి. ఇక అందుకే ఈసారి ఆచితూచి అడుగులు వేశారని చెప్పవచ్చు. అందులో భాగంగానే తాజాగా వెంకటేష్, ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో సినిమా చేశారు. అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’. జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పాటలన్నీ సూపర్ హిట్..
ప్రముఖ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary) తో పాటు మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh)ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్యగా, మీనాక్షి చౌదరి మాజీ లవర్ గా నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ‘గోదారి గట్టుమీద’ పాటకు విపరీతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ లెక్కలు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగబోతున్న వెంకటేష్ మూవీకి ఇప్పటివరకు ఎంత బిజినెస్ జరిగిందో ఇప్పుడు చూద్దాం.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ బిజినెస్ లెక్కలు..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా బిజినెస్ లెక్కల విషయానికి వస్తే.. ఆంధ్ర సీడెడ్ లో రూ.5 కోట్లకు సినిమా హక్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో వైజాగ్ ఏరియాను దిల్ రాజే పంపిణీ చేసుకుంటున్నారు. అలాగే నైజాం ఏరియాలో రూ.15 కోట్లకు అమ్ముడు పోగా అక్కడ కూడా దిల్ రాజే పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా రూ.3కోట్ల మేర బిజినెస్ చేసింది. మొత్తానికి అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్..
ఇకపోతే జనవరి 14వ తేదీన సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జనవరి 6వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనిపై చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా మరొకవైపు ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో అనిల్ రావిపూడి,వెంకటేష్ కాంబినేషన్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందనే ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.