Nikhat zareen: రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, భారత మహిళా ఒలంపిక్ అథ్లెట్ నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) గా అధికారికంగా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు హైదరాబాద్ లోని యూసఫ్ గూడా ఫస్ట్ బెటాలియన్ లో పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ బాక్సర్, డీఎస్పీ నిఖత్ జరీన్ పాల్గొన్నారు.
Also Read: Champions Trophy 2025: రోహిత్ కు దెబ్బ మీద దెబ్బ.. వన్డే కెప్టెన్సీ కూడా గల్లంతు !
ఆమెతోపాటు డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం రావడంతో తన కళ నెరవేరిందని తెలిపారు. టీజీఎస్పీలో బాక్సింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని డిజిపి ప్రకటించారని.. ఆ అకాడమీలో తనవంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు. ఇప్పటివరకు నన్ను అందరూ బాక్సర్ నిఖత్ జరీన్ అని పిలిచేవారు.. కానీ ఇప్పటినుండి డీఎస్పీ నిఖత్ అని కూడా పిలుస్తూ ఉంటే సంతోషంగా ఉందని అన్నారు.
ట్రైనింగ్ పొందుతున్న కానిస్టేబుల్స్ కి బాక్సింగ్ లో కూడా శిక్షణ ఇవ్వాలని డిజిపి తనని కోరారని తెలిపారు నిఖత్. తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ నుంచి కూడా ఒలంపియన్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని తయారు చేయవచ్చని తెలిపారు. ఇక డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. మన టీజీఎస్పీలో ఇద్దరు ఇంటర్నేషనల్ ఆటగాళ్లు చేరారని అన్నారు.
వారిలో ఒకరు నిఖత్ జరీన్, మరొకరు క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ అని తెలిపారు. వీరిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నానని పేర్కొన్నారు. పోలీస్ ట్రైనింగ్ లో భాగంగా క్రికెట్, బాక్సింగ్ పై కూడా శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆటగాళ్లను కూడా తయారు చేయాలన్నదే తమ ఆశయమని పేర్కొన్నారు డీజీపీ. 1996 జూన్ 14వ తేదీన తెలంగాణలోని నిజామాబాద్ లో జన్మించింది నిఖత్.
చిన్న వయసులోనే బాక్సింగ్ కెరీర్ ప్రారంభించి.. తక్కువ కాలంలోనే గొప్ప బాక్సర్ గా ఎదిగింది. బాక్సింగ్ లో అద్భుత విజయాలు సాధించింది. 2011 లో ఏఐబిఏ ఉమెన్స్ యూత్, జూనియర్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్, 2014లో సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్, 2019లో బల్గేరియాలోని సోఫియాలో జరిగిన స్టాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్, 2021లో టర్కీలో జరిగిన ఇస్తాంబుల్ బోస్పరస్ బాక్సింగ్ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటింది నిఖత్.
Also Read: IND vs AUS Test: బెడిసికొట్టిన గంభీర వ్యూహం.. టీమిండియా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే ?
ఇక 2024 సంవత్సరంలో పారిస్ ఒలంపిక్స్ – 2024 లో భాగంగా తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగిన నిఖత్ కి నిరాశ ఎదురయింది. మహిళల 50 కేజీల విభాగంలో పోటీపడిన నిఖత్.. ప్రాథమిక దశలోనే వెనుదిరిగింది. చైనాకు చెందిన వూ యూ చేతిలో ఓటమిపాలైంది.