Sapthagiri :ప్రముఖ కమెడియన్ సప్తగిరి (Saptagiri), ప్రియాంక శర్మ (Priyanka Sharma) హీరో హీరోయిన్లుగా అభిలాష్ రెడ్డి గోపిడి (Abhilash Reddy Gopidi) దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’. కే.వై.బాబు, భాను ప్రకాష్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రం. మార్చి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తున్న ఈ సినిమాని ఈ సోమవారం నాడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రసాద్ అనే నేను అంటూ సాగిన ఈ టీజర్ లో హీరో సప్తగిరి, మురళీధర్ గౌడ్ చేసిన హంగామా టీజర్ కే హైలెట్గా నిలిచింది. హాస్యం, సామాజిక వ్యాఖ్యానం మేలవింపుగా వచ్చిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల మెప్పిస్తుందని, సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇకపోతే శ్రీనివాస్, అన్నపూర్ణమ్మ, లక్ష్మణ్, ప్రమోదిని, ప్రభావతి, భాష, రాంప్రసాద్, రోహిణి వంటి వారు కీలక పాత్రలు పోషించారు.
పెళ్లి కోసం ఆరాటపడుతున్న కమెడియన్ సప్తగిరి..
భారీ అంచనాల మధ్య మార్చి 21వ తేదీన రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే ప్రభాస్ శ్రీను(Prabhas Sreenu) తో కలిసి సప్తగిరి చేసిన ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమోషన్స్ లో డైరెక్టర్ తో పాటు ప్రభాస్ శ్రీను అలాగే ఇద్దరు డోలు వాయించేవాళ్లు ఈ వీడియోలో మనం చూడవచ్చు. కట్నం కావాలని ప్రభాస్ శ్రీను అడగడం.. కట్నం ఇచ్చి ఈ కాలంలో ఎవరు పెళ్లి చేసుకోవడం లేదు అని సప్తగిరి కామెంట్లు చేశారు. అంతే కాదు సినిమా వాళ్లు అని చెప్పడంతో ఎవరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు అని సినిమాలో తన కష్టాన్ని రియల్ లైఫ్ లో తన కష్టాన్ని జోడించి చెప్పడంతో సప్తగిరి కష్టాలు మామూలుగా లేవు కదా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.. అటు కామెడీతో నిజ జీవితాన్ని ముడిపెడుతూ ఈ సినిమాను చేసినట్లు తెలుస్తోంది అని సినీ విశ్లేషకులు కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే రియల్ “పెళ్లి కాని ప్రసాదు” రీల్ లో.. పెళ్లికాని ప్రసాద్ గానే నటించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
సప్తగిరి కెరియర్..
సప్తగిరి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందినవారు. నటుడు కాకముందు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ‘బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడైన భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వచ్చిన ‘పరుగు’ సినిమా ఈయనకు మంచి గుర్తింపును అందించింది. ఆ తర్వాత ప్రేమా కథ చిత్రం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలతో నటుడిగా పేరు సొంతం చేసుకొని, మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు. ఇక లో బడ్జెట్ చిత్రాలలో హీరోగా కూడా నటించి ఆకట్టుకున్నారు. 2016లో డిసెంబర్లో వచ్చిన ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. సప్తగిరి పేరు పెట్టుకోవడం వెనుక అసలు కారణం ఏమిటంటే ..ఇంటర్ పరీక్షలు అయ్యాక తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన ఈయనను చూసి ఒక సాధువు రూపంలో ఉన్న వ్యక్తి.. సప్తగిరి అనే సంబోధించడంతో అది ఎందుకో బాగుందనిపించి, తర్వాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నారట. అలా వెంకట ప్రభు ప్రసాద్ కాస్త సప్తగిరిగా మారిపోయారు.