BigTV English

Sarpatta 2 Update : సక్సెస్‌ఫుల్ మూవీకి సీక్వెల్… షూటింగ్ స్టార్ట్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

Sarpatta 2 Update : సక్సెస్‌ఫుల్ మూవీకి సీక్వెల్… షూటింగ్ స్టార్ట్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

Sarpatta 2 Update : తమిళ స్టార్ హీరో ఆర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఆయన తమిళ్ళో మాత్రమే కాదు తెలుగులో కూడా డిమాండ్ ఎక్కువ.. హీరో తెలుగులో కూడా పలు సినిమాలో నటించి మంచి క్రేజ్ ని దక్కించుకున్నారు. అయితే ఈ హీరో కరోనాకు ముందు నటించిన సినిమాలన్నీ కూడా అతనికి ఏమాత్రం పాజిటివ్ టాక్ ని అందించలేకపోయాయి. ఆయన నుంచి హిట్ సినిమా ఎప్పుడు వస్తుందని ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేశారు.. కరోనా రెండో లాక్ డౌన్ సమయంలో 2021 జూన్ లో ఆర్య నటించిన సార్పట్ట పరంబరై సినిమా డైరెక్ట్ అమెజాన్ ఓటీటీలో రిలీజయింది. అప్పటివరకు ఫ్లాప్స్ లో ఉన్న డైరెక్టర్ పా రంజిత్ కి, ఆర్యకి ఈ సినిమా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది.. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ ని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ మూవీ షూటింగ్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..


‘సార్పట్ట 2 ‘ షూటింగ్ స్టార్ట్..

గతంలో వచ్చిన సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. అయితే పా రంజిత్ దర్శకత్వంలోనే ఆర్య హీరోగా సార్పట్ట రౌండ్ 2 అని ఇటీవల ప్రకటించారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుందని . దీంతో ఆర్య ఫ్యాన్స్, ఈ సినిమా అభిమానులు ఈ సారి మరింత అదిరిపోవాలి, సినిమా కోసం ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ఏమని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..


Also Read : బాక్సాఫీస్ ఊచకోత.. కాసులు వర్షం కురిపిస్తున్న ‘సింగిల్’… ఎన్ని కోట్లంటే..?

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

తమిళ హీరో ఆర్య హీరోగా, దుసారా విజయన్ జంటగా నటించారు. ఈ మూవీ మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది. పల్లెటూరు వాతావరణం కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు.. ఆర్య హీరోగా పల్లెటూళ్ళో ఆడే బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. బాక్సింగ్ బాగా ఆడే ఆర్య కొన్ని కారణాల వల్ల బాక్సింగ్ కి దూరమవుతాడు. తర్వాత మళ్ళీ బాక్సింగ్ రింగ్ లోకి వచ్చి తన ప్రత్యర్థులతో తలపడాల్సి వస్తుంది. అయితే తన శరీరం సహకరించదు. అలాంటి పరిస్థితుల నుంచి తన శరీరాన్ని బాక్సింగ్ కి అనుగుణంగా మార్చుకొని విలన్ల మీద ఎలా గెలిచాడు అనేదే కథ. ఇందులో చూపించిన బాక్సింగ్ సన్నివేశాలు, ఓడిపోయిన ఆర్య ఎమోషన్స్, ఆర్యకి ట్రైనింగ్ ఇచ్చిన క్యారెక్టర్ లో పశుపతి అద్భుతమైన నటన.. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఏ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని డైరెక్టర్ చెబుతున్నారు.. త్వరలోనే దీని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది..

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×