Padi kaushik – Rohit: ఇండియాలో ( INDIA) క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ అంతా కాదు. అయితే ఈ ఇండియన్ క్రికెట్ ( Indian Cricket ) లో చాలామంది.. రిటైర్మెంట్ అయిన తర్వాత రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. కొంతమంది రంజీ ట్రోఫీ లలో రాణించి.. జాతీయ జట్టులో స్థానం దక్కించుకోలేక… క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పిన వారు ఉన్నారు. అలా రంజి ట్రోఫీ ఆడి.. ఆ తర్వాత క్రికెట్కు గుడ్ బై చెప్పిన వారిలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం హుజరాబాద్ ఎమ్మెల్యేగా, గులాబీ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు పాడి కౌశిక్ రెడ్డి ( Paasi koushik reddy).
రోహిత్ శర్మ వికెట్ తీసిన పాడి కౌశిక్ రెడ్డి
గతంలో హైదరాబాద్ తరఫున రంజిత్రోఫీలో పాడి కౌశిక్ రెడ్డి ఆడేవాడు అన్న సంగతి తెలిసిందే. మంచి ఫిజిక్ అలాగే హెయిట్ ఉన్న పాడి కౌశిక్ రెడ్డి పూర్తిగా ఆల్ రౌండర్. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాడు. అయితే అలాంటి పాడి కౌశిక్ రెడ్డి తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. గతంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ తీసిన అంశాన్ని గుర్తుచేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ను పెట్టాడు పాడి కౌశిక్ రెడ్డి.
గతంలో ముంబై వర్సెస్ హైదరాబాద్ మధ్య రంజీ ట్రోఫీ ( Ranji Trophy between Mumbai vs Hyderabad ) జరిగింది. ఈ నేపథ్యంలోనే… హైదరాబాద్ జట్టు తరఫున పాడి కౌశిక్ రెడ్డి బౌలింగ్ చేశాడు. అటు రోహిత్ శర్మ.. బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో.. పాడి కౌశిక్ రెడ్డి వేసిన అద్భుతమైన బంతికి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో 25 ఓవర్లు వేశాడు పాడి కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే తొమ్మిది ఓవర్లు మేడిన్ చేశాడు. అలాగే 48 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ మ్యాచ్కు సంబంధించిన ఫోటోను గతం లో ఓ న్యూస్ పేపర్ ప్రచురించింది. అయితే ఆ ఫోటో తాజాగా తనకు దొరకడంతో సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
రోహిత్ శర్మ (Rohit Sharma) వికెట్ తీయడం గర్వంగా ఉంది
క్రికెట్ నాకు ఎప్పుడు కూడా ఇష్టమైన ఆట. ఈ మధ్య కాలంలో కొన్ని పాత వార్తా పత్రికలను చూశాను.. ఈ నేపథ్యంలోనే పాత జ్ఞాపకాలలో భాగంగా ముంబై మ్యాచ్ కు ( Mumbai Match ) సంబంధించిన ఒక పోస్టర్ దొరికింది అని తెలిపాడు. అది కూడా టీమిండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ వికెట్ తీయడమే… అది చూస్తే తనకు ఎంతో ఆనందం కలిగిందని వివరించాడు. అందుకే సోషల్ మీడియాలో పంచుకొని తన అనుభవాలను.. జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్లు తెలిపాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Cricket has always been a deep passion of mine and recently I came across some old newspaper clippings that stirred up a wave of nostalgia. One memory that stood out was the unforgettable moment when I dismissed the current Indian captain Rohit Sharma. Moments like these are… pic.twitter.com/6wHtrtLzyX
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) May 13, 2025