BigTV English

Single Collections : బాక్సాఫీస్ ఊచకోత.. కాసులు వర్షం కురిపిస్తున్న ‘సింగిల్’… ఎన్ని కోట్లంటే..?

Single Collections : బాక్సాఫీస్ ఊచకోత.. కాసులు వర్షం కురిపిస్తున్న ‘సింగిల్’… ఎన్ని కోట్లంటే..?

Single Collections : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, కేతిక శర్మ,ఇవానా హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం సింగిల్.. కామెడీ ఏంటర్టైనర్ గా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది.. యంగ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా..గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి కలిసి నిర్మించారు.  సినిమా మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మూడు రోజులు కలెక్షన్స్ఎ క్కువగా రాబట్టింది.. దాంతో నాల్గొవ రోజు కూడా అంతే రేంజులో కలెక్షన్స్ ను వసూల్ చేసింది. మరి నాలుగు రోజులకు ఎంత వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం..


నాలుగు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే..

శ్రీవిష్ణు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. గతఏడాది వచ్చిన స్వాగ్ అంతగా ఆకట్టుకోలేదు.. కలెక్షన్స్ బాగానే వసూల్ చేసింది. ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన సింగిల్ మూవీ పాజిటివ్ టాక్ ను అందుకుంది. తొలి మూడురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.11.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే రూ.4.15 కోట్లు, రెండో రోజు రూ.7.05 కోట్లు వచ్చాయి. మూడో రోజు 16. 2 కోట్లు వసూల్ చేసింది. నాలుగు రోజులకు 19 కోట్లవరకు వసూల్ చేసింది. దీంతో విష్ణు కెరీర్‌లోనే మరో సక్సెస్ మూవీ ఖాతాలో పడిపోయింది. తెలుగులో మాత్రమే కాదు.. అటు ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తున్నాయి. అందుకోడంతో పాటుగా కలెక్షన్స్ ని కూడా వసూలు చేసింది. రెండు రోజుల్లో యూఎస్‌లోనూ $400k దాటేసింది. మొత్తానికి ఈ సినిమా మంచి టాక్నే సొంతం చేసుకుంది.. కలెక్షన్స్ ఈ వీకెండ్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ ట్రేడ్ పంతులు అంటున్నారు.


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

సింగిల్ స్టోరీ విషయానికొస్తే.. 

కామెడీ శ్రీ విష్ణు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. మొదట్లో కాస్త ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఈమధ్య హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న శ్రీ విష్ణు స్వాగ్ మూవీతో నిరాశ పరిచాడు. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తనదైన శైలిలో డిఫరెంట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సింగిల్ మూవీ కూడా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పించింది. బ్యాంకులో మంచి ఉద్యోగం, జీతం ఉన్నా ఎందుకో సింగిల్ గానే ఉండిపోయాడు విజయ్. కార్ల షోరూం లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేసే పూర్వ ను ప్రేమిస్తాడు. కానీ.. విజయ్ ను హరిణి ప్రేమిస్తుంది.. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరి ప్రేమ గెలిచింది? ఈ ప్రేమకథలో తలెత్తిన ఇబ్బందులు ఏమిటి? చివరికి విజయ్ సింగిల్ గా మిగిలిపోయాడా? లేక మింగిల్ అయ్యాడా? అనేది మూవీ స్టోరీ.. నాలుగో రోజు కలెక్షన్స్ ను బాగానే వసూల్ చేస్తుంది. మరి ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×