BigTV English

Lavanya Tripathi: బాత్ రూమ్ లో భర్తను కట్టేసి మెగా కోడలి రచ్చ..

Lavanya Tripathi: బాత్ రూమ్ లో భర్తను కట్టేసి మెగా కోడలి రచ్చ..

Sathi Leelavathi: అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠి తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న లావణ్య ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది కానీ, మంచి విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. స్టార్ హీరోయిన్ గా  నెంబర్ వన్ స్థానంలో ఎదగడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ,లావణ్య కు అవకాశాలు వచ్చిన విజయాలు మాత్రం దక్కలేదు.


 

ఇక మెగా హీరో వరుణ్ తేజ్ న ప్రేమించి పెళ్లి చేసుకుని మెగా ఇంటి కోడలిగా మారింది. మిస్టర్ సినిమా లో ఈ జంట మొదటిసారి నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ప్రస్తుతం లావణ్య గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత లావణ్య సినిమాల్లో నటించదు అని అనుకున్నారు. కానీ, లావణ్య మాత్రం మంచి మంచి కథలను ఎంచుకొని ప్రేక్షకుల్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటుంది.


 

పెళ్లి తర్వాత ఆమె ఎక్కువ సినిమాల పైన కాకుండా ఓటిటి వెబ్ సిరీస్ లపై  అమ్మడు ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆమె నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఓటీటీ లో మంచి విజయాన్ని దక్కించుకుంది ఇక ఈసారి అంతకుమించిన హిట్ను అందుకోవడానికి లావణ్య మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది. తాజాగా లావణ్య టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం సతీ లీలావతి. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నాడు.

 

దేవ్ మోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంత -గుణశేఖర్ కాంబోలో వచ్చిన శాకుంతలం సినిమాతో దేవ్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా దేవ్ అందానికి ఛార్మింగ్ కి అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత ఇంకే తెలుగు సినిమాలో కనిపించని దేవ్  ఇప్పుడు సతీ లీలావతి తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను  మేకర్స్ రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్ చాలా కొత్తగా కనిపిస్తుంది. హీరో దేవ్ మోహన్ ను బాత్ రూమ్ లో కట్టేసి.. ఎదురుగా లావణ్య మైక్ లో గట్టిగా అరుస్తూ కనిపించింది.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

 

పెళ్లి తర్వాత మంచి మంచి పాత్రలు ఎంచుకుంటున్న లావణ్య ఇందులో కూడా ఎలాంటి గ్లామర్ లేకుండా మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం లావణ్య భర్త వరుణ్ తేజ్ తో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లి తర్వాత మంచి మంచి కథలను ఎంచుకుంటున్న మెగా కోడలికి  ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×