ZEBRA Trailer: టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఓల్డ్‌టౌన్ పిక్చర్స్ మరియు పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఎస్ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. కన్నడ హీరో, పుష్ప విలన్ డాలీ ధనుంజయ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్,సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జీబ్రా నవంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. “ఈ ప్రపంచంలో ట్రస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ సూట్ అయ్యేది ఒక్క బ్యాంక్ కు మాత్రమే” అని సత్యదేవ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఇందులో సత్యదేవ్, సత్య, ప్రియా బ్యాంకు ఉద్యోగులుగా కనిపించారు.
Akkineni Nagarjuna: కుబేర గ్లింప్స్.. అందరి చూపు నాగ్ పైనే..?
ఎక్కడ డబ్బు ఎక్కువ ఉంటుందో .. అక్కడ తప్పులు జరగడం కామన్ అని చెప్పుకోస్తూ.. బ్యాంక్ లో ఒక తప్పు జరిగినట్లు చూపించారు. బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ లో ఒక డిజిట్ తప్పు పడడం వలన సత్యదేవ్ సమస్యలల్లో ఇరుక్కున్నట్లు చూపించారు. ఇక ఆ సమస్య నుంచి బయటపడడానికి.. అతను కూడా బ్యాంక్ లో తప్పు చేయడం.. దానివలన ధనుంజయ చేతిలో చిక్కడం జరిగినట్లు తెలుస్తోంది.
డబ్బుకన్నా ముఖ్యమైంది మర్యాద అని, అది సత్యదేవ్ వలనే పోవడంతో అతనే ఆ మర్యాదను తీసుకురావాలని ధనుంజయ .. సత్యదేవ్ నాకు వార్నింగ్ ఇవ్వడంతో వీరిమధ్య టామ్ అండ్ జెర్రీ ఆట ఉండనుందని తెలుస్తోంది. అసలు బ్యాంక్ లో డిజిట్ మార్చడం వలన వచ్చిన సమస్య ఏంటి.. ? డబ్బు కోసం సత్యదేవ్ ఏం చేశాడు.. ? ధనుంజయ మర్యాద ఎక్కడ పోగొట్టుకున్నాడు.. ? చివరికి ఈ ముగ్గురు బ్యాంకు ఉద్యోగుల పరిస్థితి ఏమైంది.. ? మధ్యలో సునీల్ ఎవరు..? సత్యరాజ్ ఎవరు.. ? అసలు జీబ్రా అంటే ఏంటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Spirit: ప్రభాస్ ను ఏం చేద్దామనుకుంటున్నావ్ వంగా మావా.. మరీ అంత తక్కువా..?
ఇలాంటి బ్యాంక్ స్కామ్ కథాంశంతోనే ఈ మధ్యనే లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే.. ఆ సినిమా గుర్తురాక మానదు. కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ ఎప్పటిలానే మ్యూజిక్ తో అదరగొట్టాడు. సత్యదేవ్ కి ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు. సత్య, సునీల్ కామెడీ హైలెట్ గా నిలువనున్నట్లు తెలుస్తోంది.
ఇక సినిమా మొత్తానికి హైలైట్ అంటే డాలీ ధనుంజయ అనే చెప్పాలి. పుష్ప లో జాలీ రెడ్డిగా అదరగొట్టిన ఆయన.. ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించాడు. మరి ఈ చిత్రంతో సత్యదేవ్, డాలీ ధనుంజయ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.