Akkineni Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఏఎన్నార్ లెగసీని కొడుకుగా నాగ్ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక టాలీవుడ్ లో నాలుగు ఫిల్లర్స్ ఉంటే అందులో అక్కినేని కుటుంబం ఒక ఫిల్లర్ అని అందరికీ తెలిసిందే. అయితే మిగతా కుటుంబాలతో పోలిస్తే అక్కినేని కుటుంబం సినిమాల విషయంలో కాస్త వెనక పడినట్లే కనిపిస్తుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. వారి వారసులు పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నారు.
కానీ, నాగార్జున ఆయన వారసులు ఇంకా ఆ రేంజ్ అందుకోలేదనే చెప్పాలి. ముఖ్యంగా గత ఏడాది నుంచి అక్కినేని నాగార్జున సినిమాలు తగ్గించాడనే చెప్పాలి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా నా సామీ రంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత హీరోగా ఎలాంటి సినిమాను ప్రకటించింది లేదు. అయితే ఈసారి నాగ్ కొత్తదారిని ఎంచుకున్నాడు. హీరోగా కాకుండా సపోర్టివ్ రోల్స్ లో కనిపించడానికి రెడీ అయ్యాడు.
Spirit: ప్రభాస్ ను ఏం చేద్దామనుకుంటున్నావ్ వంగా మావా.. మరీ అంత తక్కువా..?
అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం కుబేర. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్లాసికల్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో అక్కినేని నాగార్జున ఒక ఐటీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే నాగ్ లుక్ రిలీజ్ అయ్యి మంచి ఆదరణను చూరగొంది. అంతేకాకుండా సినిమాపై ఎన్నో అంచనాలను క్రియేట్ చేసింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రానుంది. నవంబర్ 15న కుబేర గ్లింప్స్ రిలీజ్ కానుందని తెలుపుతూ రెండు రోజుల క్రితమే రష్మిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక నేడు నాగార్జున పోస్టర్ ను రిలీజ్ చేసి ఇంకో అప్డేట్ ఇచ్చారు. ఇక ఈ పోస్టర్ లో నాగ్ క్లాస్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న కుబేర త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.
Pushpa 2: ఆ ఒక్క సీన్ కోసమే రూ.60 కోట్లు.. సీక్రెట్ రివీల్ చేసిన నటుడు..!
నిజం చెప్పాలంటే కుబేర సినిమాపై ధనుష్ కంటే ఎక్కువ నాగ్ ను చూడడానికి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొదటిసారి నాగార్జున హీరోగా కాకుండా సపోర్టివ్ రోల్ లో కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలి.
ఇక ఈ సినిమాలోనే కాకుండా నాగార్జున కోలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నాడు.రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో కూడా నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలు నాగార్జున కెరీర్లోఎలాంటి మలుపులను తీసుకురానున్నాయో చూడాలి.