Producer Ravi about Megastar Chiranjeevi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ బ్యానర్ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాతో ఈ బ్యానర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కెరియర్ మొదలుపెట్టింది. అయితే ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఈ బ్యానర్ కి మంచి సక్సెస్ రేట్ ఉంది. కేవలం సినిమాలు నిర్మించడం మాత్రమే కాకుండా డిస్టిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసింది ఈ సంస్థ. లాస్ట్ ఇయర్ సంక్రాంతి కానుక ఈ బ్యానర్ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. ఇక ప్రస్తుతం ఈ బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఊస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈ బ్యానర్ లో రానుంది. ఈ బ్యానర్ లో రవి, నవీన్ ఎర్నేని ప్రొడ్యూసర్లుగా సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా సత్యదేవ్ నటించిన జీబ్రా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు నిర్మాత రవి. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈవెంట్ రవి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి మేము చేసిన రెండు సినిమాలకి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఆ రెండు సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఫంక్షన్ కు ఆయన వచ్చారు ఆ సినిమా కల్ట్ క్లాసిక్ అయింది. ఆ తర్వాత ఉప్పెన సినిమాకి ఆయన వచ్చారు ఆ సినిమా నేషనల్ అవార్డు కొట్టింది. ఆ సినిమా మొదట కథ వినడం నుంచి ఆయన ఉంటూ సినిమాను ఎంకరేజ్ చేశారంటూ తెలిపారు.
Also Read: Akkineni Nagarjuna: కుబేర గ్లింప్స్.. అందరి చూపు నాగ్ పైనే..?
ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బయటకు చెప్పకపోయినా కూడా పెద్దదిక్కు అంటే వెంటనే గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి పేరు మాత్రమే. ఎన్నో సినిమాలకు ముఖ్య అతిథిగా హాజరై ఆ సినిమాలకు మంచి పాజిటివ్ బజ్ వచ్చేలా మెగాస్టార్ చిరంజీవి నిలబడ్డారు. ఇక ప్రస్తుతం సత్యదేవ నటిస్తున్న జీబ్రా సినిమా కూడా అలానే విచ్చేశారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే రిలీజ్ అని టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. సోషియో ఫాంటసీ జోనర్ లో ఈ సినిమా రానుంది.