BigTV English

Maa Oori Polimera 2 Trailer: వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘పొలిమేర 2’ ట్రైలర్.. ఈసారి డోస్ పెంచారుగా..

Maa Oori Polimera 2 Trailer: వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘పొలిమేర 2’ ట్రైలర్.. ఈసారి డోస్ పెంచారుగా..

Maa Oori Polimera 2 Trailer : కరోనా టైంలో ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా ఓటీటీలో భారీ విజయాన్ని అందుకున్న చిత్రం మా ఊరి పొలిమేర.సత్యం రాజేష్, బాలాదిత్య, గెటప్ శ్రీను మెయిన్ క్యారెక్టర్స్ లో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూసేవారి వెన్నులో వణుకు పుట్టించింది.చేతబడి కాన్సెప్ట్స్ తో సాగే ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు అనిల్ విశ్వనాథ్ వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ కూడా రాబోతుంది. విడుదల తేదీ దగ్గర కావడంతో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ విడుదల చేయడం జరిగింది.


మా ఊరి పొలిమేర మూవీ కంటే కూడా దాన్ని సీక్వెల్ ట్రైలరే మరింత భయానకంగా ఉంది. సత్యం రాజేష్ కెరియర్ లోని పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం ఇది. గౌరు గణబాబు సమర్పణలో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని గౌరీ కృష్ణ నిర్మించారు. నవంబర్ 3 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కూడా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. ఒక్క ట్రైలరే ఇంత భయం పుట్టిస్తుంది అంటే ఇంకా పెద్ద పిక్చర్ ఎలా ఉంటుందో స్క్రీన్ పై చూడాల్సిందే.

మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఒక దారుణం. చేతబడలు అనేది ఉన్నాయి అంటే నిజంగా మీరు నమ్ముతారా? ఒకే చితిలో రెండు శవాలు.. అంటూ టీవీలో యాంకర్ చదివే డైలాగ్స్ తో ప్రారంభం అయ్యే వీడియోలో.. ప్రతి వాడి నిజాయితీకి ఒక రేటు ఉంటుంది. కానీ అది వాడి వీక్నెస్ ని బట్టి ఉంటుంది అంటూ హీరో క్యారెక్టర్ ని చూపిస్తారు. ఆ తర్వాత ఊరి పొలిమేరలో ఒక గుడిని చూపించడం జరుగుతుంది.


ప్రతి ఊరి గుడికి ఒక హిస్టరీ ఉంటుంది కానీ ఈ గుడికి మాత్రం పెద్ద మిస్టరీ ఉంది అంటూ .. ఈ గుడికి ఒక శాపం ఉందని.. వేసిన నాగబంధాన్ని పెంచాలి అంటే.. బంధాన్ని తెంచుకోవాలని చెబుతూ నరబలి చేయాలంటూ కొన్ని హై సస్పెన్స్ సీన్స్ చూపించడం జరుగుతుంది. మరోపక్క స్వార్థంతో చేస్తే అది హత్య, ఆశయంతో చేస్తే అది యుద్ధం, స్వార్థంతో చేసే ఏ యుద్ధంలో అయినా ఆశే ఉంటుంది కానీ ఆశయం ఏడుంది మామ.. అంటూ వచ్చే డైలాగ్ వేరే లెవెల్ లో ఉంది. ఇక ట్రైలర్ ఎండలో గుడికి అనంత పద్మనాభ స్వామి గుడికి ఏదైనా లింక్ ఉందా? అంటూ ఒక క్వషన్ రైజ్ చేసి వదిలేస్తారు.

మొత్తానికి ట్రైలర్ ఆధ్యంతం ఎంతో ఆసక్తిగా, గ్రిప్పింగ్గా, సస్పెన్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక్క ట్రైలర్ తో చిత్రంపై హైప్ ని అమాంతం పెంచేసాడు డైరెక్టర్. మొదటి భాగాన్ని మించి ఈ సీక్వల్ ఉంటుంది అన్న విషయాన్ని ట్రైలర్ తో స్పష్టంగా అర్థం అవుతుంది. పైగా మొదటి చిత్రాని కంటే కూడా బడ్జెట్ దీనికి కాస్త ఎక్కువే ఖర్చు చేశారు అనే విషయం నెక్స్ట్ లెవెల్ లో ఉన్న విజువల్స్ ని చూసి కనిపెట్టేయొచ్చు. ఇందులో సీన్స్ చాలా సహజంగా ఉండడమే కాకుండా అక్కడక్కడ భలే భయపడుతున్నాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×