Sekhar Kammula :తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఉన్నతమైన చదువులు చదువుకొని డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాకి సంబంధించి శేఖర్ కమ్ములకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సినిమా తర్వాత శేఖర్ దర్శకత్వం వహించిన సినిమా ఆనంద్. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాతో పాటు రిలీజ్ అయిన ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్ వస్తుందని చిత్ర యూనిట్ కూడా ఊహించలేదు. ఇక శేఖర్ కమ్ముల బెస్ట్ వర్క్ అంటే హ్యాపీడేస్ అని చెప్పొచ్చు. శేఖర్ కమ్ముల దగ్గర నాగ్ అశ్విన్ లీడర్ మరియు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు పనిచేశాడు.
ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో నాగ అశ్విన్ ఒకరు. నాగ అశ్విన్ సక్సెస్ను శేఖర్ కమ్ముల కూడా అదే రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. లీడర్ సినిమాకి సంబంధించి నాగ్ అశ్విన్ కాంట్రిబ్యూషన్ ఎంతుందో పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు శేఖర్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి కూడా నాగి వర్క్ చేశాడు. నాగ అశ్విన్ గురించి శేఖర్ మాట్లాడుతూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఉన్న కుక్కను తనతో పాటు ఇంటికి తీసుకు వెళ్ళాడు. అనిమల్స్ ని బాగా లవ్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఆ కుక్క తనతో పాటు ఉందో లేదో తెలియదు. చాలా కూల్ గా కామ్ గా ఉంటాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా జరుగుతున్నప్పుడు హీరోయిన్ శ్రీయా తనను బాబా అని పిలిచేది అంటూ రివీల్ చేశాడు.
అంతేకాకుండా తనను ఎప్పటినుంచి ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏదైనా తినేటప్పుడు అన్ని కలిపి ఒకేసారి తింటూ ఉంటాడు. సో అది నాకు ఎప్పుడూ అర్థం కాలేదు వీలుంటే మీరు అడగండి అని ఆ యాంకర్ కు తెలిపాడు శేఖర్. ఆ ప్రశ్నను అడగ్గానే చాలా తెలివిగా ఆన్సర్ చెప్పాడు నాగి. అన్ని అలా కలిపి తినడం వలన పెద్దగా ఏమీ లాభం లేదు లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని కలిసిపోతాయి కదా అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అలా కొంత కొంత క్వాంటిటీని మిక్స్ చేసుకొని తిన్నప్పుడు డిఫరెంట్ టేస్ట్ ఏమైనా అనిపిస్తుందా అని ఒక ఇంటెన్షన్ తో కూడా తింటుంటాను అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు నాగ అశ్విన్. ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకు సంబంధించి ఆ కుక్క విషయానికొస్తే కొన్నేళ్ల వరకు తనతో పాటే ఉండేదని ఆ తరువాత అది కొద్ది రోజుల క్రితమే మరణించింది అంటూ చెప్పుకొచ్చాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తనకు బాగా అది అలవాటైపోవడం వల్లనే తీసుకువెళ్లాను అంటూ చెప్పాడు.
Also Read : Nag Ashwin : కల్కి సినిమాకి చిట్టీలు వేసాం