BigTV English
Advertisement

Sekhar Kammula: మళ్ళీ తమిళ్ హీరోతోనే చేస్తున్నాడు… ఏంటీ డైరెక్టర్ గారు తెలుగు హీరోలు లేరా?

Sekhar Kammula: మళ్ళీ తమిళ్ హీరోతోనే చేస్తున్నాడు… ఏంటీ డైరెక్టర్ గారు తెలుగు హీరోలు లేరా?

Sekhar Kammula: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న వారిలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఒకరు. అందరికీ దర్శకుల మాదిరి కాకుండా ఈయన చాలా విభిన్నమైన ధోరణిలో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. శేఖర్ కమ్ముల సినిమా అన్ని తరాల వాళ్ళు ఇష్టపడేలాగా మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగించే విధంగా ఉంటాయని చెప్పాలి. ఇలా విభిన్నమైన జానర్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న శేఖర్ కమ్ముల త్వరలోనే కుబేర(Kubera) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.


తమిళ హీరోలకే అవకాశం…

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Danush)ప్రధాన పాత్రలో రష్మిక(Rashmika) హీరోయిన్గా నటించిన ఈ చిత్రం జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.. ఇక ఈ సినిమాలో సీనియర్ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇలా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈయన చివరిగా లవ్ స్టోరీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక కుబేర సినిమా మరి కొన్ని రోజులలో విడుదల కాబోతున్న నేపథ్యంలో శేఖర్ కమ్ముల తదుపరి ప్రాజెక్టుల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.


మళ్లీ ధనుష్ తోనే…

శేఖర్ కమ్ముల మరో ప్రాజెక్టును కూడా హీరో ధనుష్ తోనే చేయబోతున్నట్టు సమాచారం. డైరెక్టర్ శేఖర్ తన దగ్గర ఉన్న రెండు అద్భుతమైన స్టోరీ లైన్స్ హీరో ధనుష్ కి చెప్పారట. అయితే ఆ రెండు స్టోరీ లైన్స్ కూడా ధనుష్ కు ఎంతగానో నచ్చాయని తెలుస్తుంది. అయితే ఇందులో ఒక సినిమాని వెంటనే శేఖర్ కమ్ముల గారితో చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇలా ఒక ప్రాజెక్టుకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, మరొకటి ఆలస్యంగా కూడా రాబోతుందని తెలుస్తోంది.

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ మరోసారి నటించబోతున్నారనే వార్తలు రావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కొంతమంది దర్శకులు పూర్తిగా తెలుగు హీరోలను పక్కన పెట్టేస్తున్నారు. ఇలా తెలుగు హీరోలకు కాకుండా కోలీవుడ్(Kollywood) హీరోలకు పూర్తిస్థాయి తెలుగు సినిమాలు చేసే అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సినిమాలలో నటించడానికి తెలుగులో కూడా చాలామంది హీరోలు ఉన్నారు. ఇలా ఆ హీరోలందరినీ కూడా కాదని కోలీవుడ్ హీరోలకు తెలుగు సినిమాలలో అవకాశాలు ఇవ్వటం ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. గతంలో వెంకీ అట్లూరి సైతం ధనుష్ తో సార్ అనే సినిమా చేసి హిట్ కొట్టారు, అలాగే దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమా చేసి మరో హిట్ అందుకున్నారు. ఇప్పుడు వెంకీ అట్లూరి హీరో సూర్యతో మరొక ప్రాజెక్టుకు కమిట్ అయ్యారు. ఇక శేఖర్ కమ్ముల కూడా ధనుష్ తో వరుస ప్రాజెక్టులకు కమిట్ అవ్వడం గమనార్హం. అయితే ఈ కొత్త ప్రాజెక్టు గురించి త్వరలోనే అధికారక ప్రకటన కూడా రాబోతుందని సమాచారం.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×