హైద్రాబాద్‌లోని దుర్గం చెరువుపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం ఓ కారులో మంటలు చెలరేగాయి. గచ్చిబౌలి నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45కు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. AP09 CA 1878 కారు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో పొగలు కమ్ముకోవడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు నుంచి బయటకు వచ్చేశాడు. కారులో ఉన్న వ్యక్తులు కూడా సమయానికి బయటకు వచ్చేయడంతో ప్రాణ నష్టం తప్పంది.
ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన కేబుల్ బ్రిడ్జ్ మీదకు చేరుకుని మంటలు అదుపు చేశారు. వంతెన మధ్యలో ఈ ఘటన చోటుచేసుకోవడం వల్ల ఇరువైపులా వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. మీరు ఆ రూట్‌లో కాకుండా వేరే మార్గంలో వెళ్లడం బెటర్.
కేబుల్ వైర్లకు మంటలు అంటుకుంటే?
ఆ కారు కేబుల్ బ్రిడ్జి వైర్లకు దగ్గరలోనే దగ్దమైంది. దీంతో అధికారుల్లో కంగారు మొదలైంది. అందుకే వాహనాలను కూడా వెంటనే బ్రిడ్జి మీద వెళ్లేందుకు అనుమతించలేదు. కేబుళ్లను పరిశీలించిన తర్వాతే అనుమతి ఇచ్చారు. ఒక వేళ అగ్నిమాపక సిబ్బంది రావడం ఆలస్యం అయ్యుంటే.. ఊహించని ప్రమాదం జరిగేంది. కేబుల్ బ్రిడ్జికి ఉన్న వైర్లు అన్ని వాతావరణాలను తట్టుకుంటుంది. అయితే, కారు దగ్దమయ్యేప్పుడు ఏర్పడే విపరీతమైన వేడి వల్ల కేబుళ్లు దెబ్బతింటే చాలా ప్రమాదం. ప్రస్తుతమైన వంతెనకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదాలివే..
ఈ వంతెనపై అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. గతేడాది ఏప్రిల్ నెలలో కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు తీసుకుంటున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ మరణించారు. అదే ఏడాది ఆగస్టు నెలలో బైకుపై వేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు డివైడర్‌ను ఢీకొట్టారు. వారు వంతెన మీద నుంచి కింద పడటంతో అక్కడికక్కడే చనిపోయారు.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని 2018 సెప్టెంబర్ 25న అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారికంగా ప్రారంభించారు. ఈ వంతెన హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌లైన హైటెక్ సిటీ, గచ్చిబౌలిని మాదాపూర్, జూబ్లిహిల్స్ తదితర ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతుంది. సుమారు ₹150 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. 435 మీటర్ల పొడవు, 4 లేన్ల వెడల్పుతో ఈ వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జి ఇప్పుడు హైదరాబాద్‌కు మరో సరికొత్త ల్యాండ్ మార్క్‌గా నిలుస్తోంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Also Read: ప్రభుత్వం ఆఫీసులో రాసలీలలు.. లిప్‌లాక్‌లు, ఆ తర్వాత.. రెచ్చిపోయిన ఉద్యోగులు