Manchu Vishnu : రోజులు మారుతున్న కొద్దీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొత్త కొత్త పదాలు కూడా రావడం మొదలయ్యింది. ముఖ్యంగా ఒక మంచి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పుడు చాలామంది తెలుగు ఫిలిం ఆడియన్స్ ఫెయిల్డ్ హియర్ అంటూ చూస్తూనే ఉంటాం. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందు విజయ్ మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ గా మారాయి. దానిని బట్టి చాలామంది విజయ్ కు ఆటిట్యూడ్ ఎక్కువ అని కూడా కొంతమంది కామెంట్ చేశారు. వాస్తవానికి విజయ్ దేవరకొండ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే యాటిట్యూడ్ అనే పదం బాగా పాపులర్ అయింది. ఇకపోతే కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ లో కౌంటర్ డైలాగ్స్ ను కట్ చేసి థగ్ లైఫ్ అని వీడియోస్ కూడా చేయడం మొదలుపెట్టారు కొంతమంది.
నాకు నటించడం రాదు
ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలలో భారీ బడ్జెట్ తో నిర్మితమైన కన్నప్ప ఒకటి. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నాడు మంచు విష్ణు. దీనిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు రివీల్ చేశాడు. ముఖ్యంగా యాటిట్యూడ్ గురించి మాట్లాడుతూ నేను పుట్టినప్పటినుంచి యాటిట్యూడ్ తోనే పుట్టాను అదే మీ అందరికీ నచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే నాకు అభిమానుల దగ్గర నటించడం రాదు. అందువలనే నేను చాలామంది అభిమానులకు దూరం అయిపోయాను. నేను ఎప్పుడూ జెన్యూన్ గానే ఉంటాను అంటూ తెలిపాడు. దీనిని బట్టి ఇండైరెక్ట్ గా చాలామంది హీరోలు అభిమానుల దగ్గర నటిస్తారు అని చెప్పినట్లే.
నాకు డూప్ దొరకడం లేదు
ఇక ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఏ స్థాయిలో డెవలప్ అయిందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. చాలామంది పెద్ద హీరోలు కంప్లీట్ గా షూటింగ్లో పాల్గొనడం కాకుండా కొన్ని రోజులు డేట్స్ కేటాయించి మిగతా రోజులు బాడీ డబుల్ తో సినిమా చేయడం మొదలుపెట్టారు. ఇక ఇదే విషయంలో మంచి విష్ణు మాట్లాడుతూ.. నా హైటు స్ట్రక్చర్ కు తగిన బాడీ డబుల్ ఇంకా దొరకలేదు అన్నారు. మోహన్ బాబు తదుపరి సినిమాకు సంబంధించి బాడీ డబుల్ ను రెడీ చేసినట్టు రివిల్ చేశారు. అలానే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మారిపోయింది.
ఒకప్పుడు మ్యూజిక్ స్టూడియోలో పాట పాడటం ఎంత కష్టంగా ఉండేదో మేము చూసేవాళ్లం. అలానే ఇప్పుడు జనరేషన్ లో నిజంగా కాంపిటేటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది యూట్యూబ్. టిక్ టాక్ బ్యాన్ చేసి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే మేము దానిలో ఏదైనా ఒకటి చేసేలోపే మా కంటే గొప్పగా తమ టాలెంట్ బయట పెట్టిన వాళ్ళు ఉన్నారు. అదే ఈరోజు ఉండుంటే చాలామంది హీరోలకు అభిమానులు ఉండేవారు కాదు అంటూ తెలిపాడు.
Also Read : Manchu Vishnu: నా అంత అందగాడు దొరకరని బుట్టలో వేసుకున్నారు, ఇది మరీ ఓవర్