Sekhar Kammula : టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి సక్సెస్ అందుకున్న శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సినిమాలు అంటే కుటుంబం మొత్తం కూర్చుని చూసే విధంగా ఉంటాయని చెప్పాలి. ఈయన సినిమాలు మనసుకు ఎంతో హాయినిచ్చే విధంగా, చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు చూసేలా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఒక శేఖర్ కమ్ములకు మాత్రమే చెందింది. ఇలా సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే శేఖర్ కమ్ముల ఇటీవల మాత్రం విభిన్నమైన జానర్ ఎంచుకొని కుబేర (Kubera) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.
లీడర్ సీక్వెల్…
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్న శేఖర్ కమ్ములకు తన సినిమాలలో ఒకటైన లీడర్ (Leader)సినిమా సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. రానా దగ్గుబాటిని(Rana Daggubati) హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల లీడర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అప్పటి రాజకీయ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇక ఈ సినిమా ద్వారా రానా నటుడిగా కూడా మంచి గుర్తింపు పొందారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం వస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లీడర్ 2(Leader 2) సినిమా గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ప్రజలు మారిపోయారు..
లీడర్ సినిమా సీక్వెల్ గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ… లీడర్ సీక్వెల్ చేయాలని నేను కూడా ఎప్పటినుంచి అనుకుంటున్నాను. అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించిన కథ మొత్తం కూడా సిద్ధం చేశానని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.. రాజకీయ నాయకులు కంటే కూడా ప్రజలు మారిపోయారని అందుకే నేను సిద్ధం చేసుకున్న కథకు, ఇప్పటి రాజకీయాలకు సెట్ అవ్వదన్న నేపథ్యంలో సినిమా ఆగిపోయిందని, సరైన లైన్ దొరికితే తప్పకుండా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తానని శేఖర్ కమ్ముల వెల్లడించారు.
అభివృద్ధి అవసరం లేదు…
ఇలా లీడర్ సినిమా సీక్వెల్ ప్రస్తుతం ఆలస్యమైన రావటం మాత్రం పక్కా అని ఈయన తెలియజేశారు. ఇటీవల కాలంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల కంటే కూడా ప్రజలలో మార్పులు వచ్చాయని, సరైన పాలన, అభివృద్ధి చేసే నాయకులను ప్రజలు ఇష్టపడటం లేదని, అంతకుమించి ప్రజలు ఇంకేదో ఆశిస్తున్నారని చెప్పాలి. ఈ తరహా కథ సిద్ధమైన వెంటనే లీడర్ 2 ఉంటుందని శేఖర్ కమ్ముల చెప్పకనే చెప్పేశారు. ఇక కుబేర విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుందని స్పష్టమవుతుంది. ఇందులో హీరోగా నటించిన ధనుష్(Danush) ఒక బెగ్గర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక నాగార్జున(Nagarjuna) కూడా కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాలో రష్మిక (Rashmika)హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా జూన్ 20వ తేదీ హిందీ తమిళ తెలుగు భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Also Read: తాతా నానమ్మల సెంటిమెంట్… ఇదిగో ఫుల్ స్టోరీ.. ఇండియాలో ఫస్ట్ టైం ఇది