BigTV English

Sundeep Kishan : రెజీనా నుంచి రూ.5 లక్షలు… సందీప్ కిషన్ బెస్ట్ ఫ్రెండ్ బెటర్ హాఫ్ కాబోతోందా?

Sundeep Kishan : రెజీనా నుంచి రూ.5 లక్షలు… సందీప్ కిషన్ బెస్ట్ ఫ్రెండ్ బెటర్ హాఫ్ కాబోతోందా?

Sundeep Kishan : ప్రముఖ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan ), టాలీవుడ్ హీరోయిన్ రెజీనా (Regina Cassandra) రిలేషన్ షిప్ లో ఉన్నారనే రూమర్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటించడంతో పాటు, సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేసుకోవడంతో రూమర్లు గుప్పుమన్నాయి. తాజాగా సందీప్ కిషన్ రెజీనా తనకు రూ.5 లక్షల క్యాష్ ఇచ్చిందని చెబుతూ, ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు.


ఆ అమ్మాయితో జీవితాంతం…  

టాలీవుడ్ స్టార్ కెమెరామెన్ ఛోటా కే నాయుడు మేనల్లుడిగా సందీప్ కిషన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమాతో ఫస్ట్ కమర్షియల్ హిట్ ని అందుకున్నాడు. ఇంకా ఆ తర్వాత వరస సినిమాలు చేసినప్పటికీ ఆయన కెరీర్ గ్రాఫ్ మాత్రం చెప్పుకో విధంగా లేదు. ఇప్పుడు సందీప్ కిషన్ ‘మజాకా’ (Mazaka) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ రెజీనా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు .


ఓ ఇంటర్వ్యూలో రెజినా కంటే ముందు పెళ్లి గురించి సందీప్ కిషన్ మాట్లాడుతూ “ఈ అమ్మాయితో నేను జీవితాంతం స్పెండ్ చేయాలి అనే ఆలోచన ఉంటేనే పెళ్లి చేసుకోవాలి తప్ప, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, అమ్మో ఫ్యామిలీని స్టార్ట్ చేయాలి కదా… అని ఆలోచనతో పెళ్లి చేసుకోవద్దు. అలాంటి అమ్మాయి ఇంకా దొరకలేదు. ఇప్పుడున్న ఎంటైర్ జనరేషన్ డిఫరెంట్ గా ఉంది. ఆలోచనలు సింక్ అవుతున్నాయా? ఫ్యూచర్ సెట్ అవుతుందా లేదా? వంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి. మొత్తం జనరేషన్ సెల్ఫిష్ గా ఉంది అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు” అంటూ చెప్పుకొచ్చారు.

రెజినాతో సందీప్ రిలేషన్ 

“నేను లాస్ట్ పది పదకొండు ఏళ్ల నుంచి నేను నా కెరియర్ గురించి పెద్దగా ఆలోచించలేదు. చాలా సినిమాలను కథ నచ్చింది కదా అని రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా చేశాను. దానివల్ల ఒకానొక టైంలో ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడ్డాను. గత ఏడాది నా ఎకౌంట్లో 11,000 మాత్రమే ఉంది. అప్పుల వల్ల గొడవలు వస్తాయి. అందుకే ఎవరి దగ్గర అప్పు చేయను. నా జీవితంలో అప్పు తీసుకుంది ముగ్గురి దగ్గరే. నా ఫ్రెండ్ మహి, మేనేజర్ హరి… రెజీనా.

ఒకసారి నాకు అవసరం అయినప్పుడు రెజీనా చెప్పకుండానే ఐదు లక్షలు ఇచ్చింది. తను నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి మా ఇంట్లో అమ్మాయి లాంటిది. గత ఆరడేళ్ళ నుంచి మేమిద్దరం క్లోజ్ గా ఉన్నాము. మేము కొట్టుకున్నంతగా ఎవరూ కొట్టుకొని ఉండరు. అలాగని ఫోన్ లో పెద్దగా మాట్లాడేదేమి ఉండదు. పుష్కరానికి ఒకసారి హలో పాపా… అంటే హాయ్ తాత’ అంటుంది. అయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది” అని అన్నారు సందీప్ కిషన్. “బెస్ట్ ఫ్రెండ్ బెటర్ ఆఫ్ కాకూడదా?” అనే ప్రశ్నకి… “ఆ అమ్మాయి గురించి నాకు అలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు” అని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అన్న విషయంపై తాజాగా సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×