Weather News: ఈ ఏడాది మన దేశ వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు చాలా ముందుగానే వచ్చాయి. ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రైతులు కూడా వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయిపోయారు. పలు జిల్లాల్లో వారం రోజుల క్రితమే పత్తిగింజలు పెట్టడం పూర్తి చేశారు. కొందరు నార్లు కూడా పోశారు. మరి కొంత మంది రైతులు పొలాలను ఇప్పుడే చదును చేస్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే గత రెండు, మూడు రోజుల నుంచి మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో రైతులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. పత్తి గింజలు పెట్టి వారం గడుస్తున్నా.. మళ్లీ వర్షాలు పడడం లేదని వరుణ దేవుడి వైపు చూస్తున్నారు.
అయితే.. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరి కొన్ని నిమిషాల్లో.. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్, జనగామ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లో వర్షే పడే ఛాన్స్ ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. అలాగే రానున్న మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. అయితే రాబోయే రెండు, మూడు రోజులు ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించారు.
ALSO READ: APMSRB Recruitment: డిగ్రీ అర్హతతో రాష్ట్రంలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. డైరెక్ట జాబ్
ఇక హైదరాబాద్ లో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భాగ్యనగరంలో వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజుల నుంచి పలు జిల్లాల్లో అయితే ఉరుములు, మెరుపులో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులు బీభత్సం సృష్టించడంతో.. కొంతమంది చనిపోయారు. అయితే రేపు, ఎ్లలుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
ALSO READ: Best Mobiles: రూ.20వేల లోపు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్.. కిర్రాక్ ఫీచర్స్ భయ్యా..
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు.