BigTV English

V.K.Naresh: అమ్మకు పద్మ అవార్డు రావడానికి పోరాటం చేస్తా.. కీలక వ్యాఖ్యలు చేసిన నరేష్..!

V.K.Naresh: అమ్మకు పద్మ అవార్డు రావడానికి పోరాటం చేస్తా.. కీలక వ్యాఖ్యలు చేసిన నరేష్..!

V.K.Naresh:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ (Krishna )మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఎన్నో చిత్రాలలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన కృష్ణ, ఎన్నో సరికొత్త టెక్నాలజీలను కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి, మంచి గుర్తింపు అందుకున్నారు. ఇకపోతే కృష్ణ ఇందిరా దేవిని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయన మాత్రం పిల్లలు పుట్టాక భార్యను ఒప్పించి.. తనతో నటించిన నటి, మహిళా దర్శకురాలు విజయనిర్మల(Vijaya Nirmala )ను రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అటు విజయనిర్మలకి కూడా కృష్ణతో రెండవ వివాహం కావడం గమనార్హం. విజయనిర్మల అంతకంటే ముందే ఒక వ్యక్తిని వివాహం చేసుకోగా.. వారిద్దరికీ పుట్టిన సంతానమే వీకే నరేష్(V.K. Naresh). ఇక ఆమె నటన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఒకప్పుడు కామెడీ హీరోగా ప్రేక్షకులను అలరించిన నరేష్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో మీడియాతో మాట్లాడిన వీకే నరేష్, తన తల్లి విజయనిర్మలకు పద్మశ్రీ అవార్డు రాకపోవడం గురించి మాట్లాడారు. ముఖ్యంగా తన తల్లిలాగే ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప గొప్ప నటీనటులు ఉన్నారు. వారందరికీ కూడా పద్మశ్రీ రాకపోవడంపై మాట్లాడుతూ ఊహించని కామెంట్లు చేశారు.


పద్మ అవార్డులపై సీనియర్ హీరో నరేష్ కామెంట్స్..

పద్మ అవార్డులపై నరేష్ మాట్లాడుతూ.. “మా అమ్మ విజయనిర్మల 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళ దర్శకురాలు. ఈ కారణంగానే ఆమె గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకుంది. అయితే ఎన్నో సినిమాలలో కూడా నటించే హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంది. అయితే అమ్మకు పద్మశ్రీ అవార్డు ఇవ్వలేదు. ఢిల్లీ స్థాయిలో కూడా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వడం కోసం నేను ఎంతో ప్రయత్నం చేశాను. అయినా కూడా మా అమ్మకు పద్మ అవార్డు రాలేదు. ఆవిడ పద్మ అవార్డు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రికమెండ్ చేశారు. ముఖ్యంగా నేను ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం లేదు. ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత నిజంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు పద్మ అవార్డులు ఇస్తున్నారు. ఈ విషయంపై సంతోషంగా కూడా ఉంది. ఎంజీఆర్ గారు బ్రతికున్నప్పుడు కూడా ఆయనకు పద్మ అవార్డు రాలేదు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా రాలేదు. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది పద్మ అవార్డుకు అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన వాళ్లకు పద్మ అవార్డులు వచ్చేందుకు, ఆమరణ నిరాహార దీక్ష చేసిన తప్పులేదు. మళ్లీ ఇప్పటినుంచి మా అమ్మకు పద్మ అవార్డు రావడం కోసం ప్రయత్నం చేస్తాను” అంటూ వీ.కే.నరేష్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


విజయనిర్మల పేరు వెనుక అసలు కథ ఇదే..

విజయనిర్మల నరసరావుపేటలో తల్లి శకుంతల,అన్నలు సంజీవరావు, వసంతరావు తో కలిసి జీవించేది. ఈమె బాల్యం మొత్తం నరసరావుపేట పాతూరు లోనే గడిచింది. రాజా గారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలోనే నృత్య ప్రదర్శన కూడా ఇస్తూ ఉండేది. తర్వాత తల్లిదండ్రులతో కలిసి చెన్నై వెళ్లిపోయిన ఈమె సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంది. ఈమె పేరు నిర్మల అయితే తనకు తొలి అవకాశం ఇచ్చిన విజయా స్టూడియోకి కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×