Sr NTR Wedding Card : సెలెబ్రేటిల గురించి తెలుసుకోవాలని అందరు అనుకుంటారు. ఇక ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలు, హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి గూగుల్ లో తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇక చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి పెళ్లి గురించి కూడా సోషల్ మీడియల్లో జల్లెడ పట్టేస్తారు. ఇక తాజాగా సీనియర్ ఎన్టీఆర్ పెళ్లి పత్రిక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ పత్రికలో ఏం రాసి ఉంది?. పెళ్లి ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ స్థానం ఎప్పుడు మొదటలోనే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించడం మాత్రమే కాదు. సినిమాలతో ప్రజలకు మెసేజ్ అందించారు. ఎన్నో అవార్డులు ఆయన సినిమాలకు అందాయి. ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగాను సత్తా చాటారు.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ వేరు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం ఆఖర్లో వివాదాస్పదం అయిన విషయం మనందరికి తెలిసిందే. ఇండస్ట్రీలోని అందరు ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా కూడా ఆయన సినిమాలు ఆయనను గుర్తు చేస్తుంటాయి. అందుకే అభిమానులు సినిమాల్లో ఆయన చూసి మురిసిపోతుంటారు.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ పెళ్లి ఇప్పటికి వైరల్ గానే ఉంటుంది. బసవతారకంను పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్ళికి అయిన ఖర్చు, శుభలేఖ ఇలా ఎన్నో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కొమరవోలుకి చెందిన తన మేనమామ కుమార్తెనే ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. అలా పెళ్ళికి ముందు ఇచ్చిన శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆయన పెళ్లి పత్రిక అంతా గ్రాంధికంలో ఉంటుంది. కొన్ని పదాలు అర్థం కావు కూడా.. వీరి పెళ్లి కొమరవోలు గ్రామంలో జరగగా, ఈ పత్రికను ఆంధ్రప్రదేశ్ గుడివాడ శ్రీ బాల సరస్వతి ప్రెస్ లో ముద్రించారు. ఈ పెళ్లి పత్రికను పెళ్లి కుమార్తె తండ్రి కాట్రగడ్డ చెంగయ్య ప్రింట్ చేయించారు. ఎన్టీఆర్ వివాహం ఏప్రిల్ 22, 1942 లో జరిగింది. 1985 లో బసవతారకం క్యాన్సర్ తో మరణించారు.. ఇప్పటి మాదిరిగా దాని మీద ప్రత్యేక డిజైన్ లు అవేమి లేవు. అవసరమైన మేటర్ మాత్రమే రాసి… ఆహ్వానం పంపించారు. ఈ శుభలేఖ ఇప్పటికీ నందమూరి బాలకృష్ణ ఇంట్లో ఉందని సమాచారం. ఆ తర్వాత ఆయన లక్ష్మి పార్వతమ్మను రెండో వివాహం చేసుకున్నారు.. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పారో అందరికి తెలుసు. తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ప్రజలకు సేవలు చేశారు. ఆయన వారసులుగా ఆయన కొడుకులు ఇప్పుడు సినిమాల్లో రానిస్తున్నారు. అలాగే మనమల్లు కూడా గ్లోబల్ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ స్టార్ హీరోలు అందరు వరుసగా సినిమాలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. వార్ 2 మూవీ సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది.