Game Changer.. ప్రముఖ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో.. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ కూడా లభించింది. అలాగే 2:45:30 సెకండ్ల నిడివితో సినిమా రన్ టైం లాక్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా సెన్సార్ బోర్డు బ్రహ్మానందం (Brahmanandam)కి షాక్ ఇస్తూ.. టైటిల్ కార్డ్స్ లో పేరు ముందు ఉన్న ‘పద్మ శ్రీ’ బిరుదును తొలగించారు. ఇక అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.
బ్రహ్మానందం కి షాక్.. కట్ చేసిన సెన్సార్..
అసలు విషయంలోకి వెళ్తే.. పద్మశ్రీ అవార్డులు కేవలం మాట్లాడే టైంలో మాత్రమే ఉపయోగించాలి.కానీ
రాత పూర్వకంగా ఉపయోగించకూడదు. ఇది పద్మ అవార్డుల రూల్ కూడా.. అందుకే బ్రహ్మానందం కు షాక్ ఇస్తూ ఆయన పేరు ముందున్న పద్మశ్రీని తొలగించింది సెన్సార్ బోర్డు.
గతంలో కోర్టు వరకూ..
ఇదిలా ఉండగా గతంలో కూడా మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu), బ్రహ్మానందం(Barhmanandam) కలిసి ‘దేనికైనా రెడీ’ సినిమా చేశారు. అప్పుడు ఇద్దరూ టైటిల్ కార్డ్స్ లో తమ పేరు ముందు ‘పద్మ శ్రీ’ అని పెట్టుకున్నారు. అప్పుడు అది పెద్ద రచ్చ అయింది. కోర్టులో కేసులు కూడా అయ్యాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన పద్మశ్రీని వాణిజ్యపరంగా వాడినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం అందజేసిన ఈ పద్మశ్రీ అవార్డులను వారం రోజుల్లోనే వెనక్కి ఇవ్వాలని, ఆ సినిమా నిర్మాత మోహన్ బాబు, హాస్యనటుడు బ్రహ్మానందం లకు హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇకపోతే అత్యున్నతమైన సేవలకు గుర్తింపుగా ఇచ్చే పురస్కారాన్ని ఇంటిపేరుగా వాడుకొని దాని విలువను నైతికంగా దిగజార్చారని, పద్మ పురస్కారాన్ని వాణిజ్యపరంగా వాడుకోవడం పై ఆవేదన వ్యక్తం చేస్తూ బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్వచ్ఛందంగా అవార్డులను వారంలోపే తిరిగి ఇవ్వాలని, భారత రాష్ట్రపతికి అందజేయాలని కూడా హైకోర్టు సూచించింది.. ఆ తర్వాత మోహన్ బాబు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి తన అవార్డును కాపాడుకున్నారు. ఇంత తతంగం జరిగినా సరే ఇప్పుడు మళ్లీ గేమ్ ఛేంజర్ సినిమా టైటిల్ కార్డ్స్ లో బ్రహ్మానందం పేరు ముందు పద్మశ్రీ అని వేయడంపై ఇలాంటి అవాంతరాలు మళ్లీ జరిగే అవకాశం ఉంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న సెన్సార్ బోర్డు ముందుగానే కట్ చేసింద. ఏది ఏమైనా అంతా తెలిసి కూడా మళ్లీ వీళ్ళు ఇలా చేయడంపై పలుచోట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పవచ్చు.
గేమ్ ఛేంజర్ సినిమా..
ఇకపోతే గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. కియారా అద్వాని, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈరోజు ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాకి ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది.