Shubman Gill – Rohit Sharma: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 – 25 సిరీస్ లో భాగంగా (5వ టెస్ట్) కీలక పోరుకు సిద్ధమైంది భారత జట్టు. సిడ్నీ వేదికగా శుక్రవారం ఉదయం నుండి ప్రారంభం కానున్న ఈ ఐదవ టెస్ట్ లో గెలుపొంది సిరీస్ ని సమం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది భారత జట్టు. అయితే ఈ ఐదవ టెస్ట్ కి కీలక మార్పులతో భారత జట్టు బరిలోకి దిగబోతోందట.
Also Read: Australia Playing XI: 5వ టెస్టుకు కొత్త డేంజర్ ప్లేయర్ తో ఆసీస్… టీమిండియా ప్లేయర్ ఔట్ !
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ని టీమ్ నుంచి తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నారట. సిడ్నీ టెస్ట్ లో రోహిత్ శర్మ ఆడతాడా..? అన్న ప్రశ్నకి మీడియా సమావేశంలో కోచ్ గౌతమ్ గంభీర్ నేరుగా సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. టాస్ వేసిన తరువాతే జట్టును ప్రకటిస్తామని తెలిపారు గౌతమ్ గంభీర్. మ్యాచ్ రోజు పిచ్ పరిస్థితి ఎలా ఉంటుందో అందుకు తగ్గట్లుగానే ప్లేయింగ్ ఎలెవెన్ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.
దీంతో రోహిత్ శర్మ పై వేటు పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ లో ఇప్పటివరకు మూడు టెస్ట్ లు ఆడిన రోహిత్ శర్మ ఐదు ఇన్నింగ్స్ లలో 6.20 సగటుతో 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం ఒక్కసారి మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. దీంతో రోహిత్ పై వేటు వేయాలనే డిమాండ్ కూడా పెరిగింది. మరోవైపు అనవసర షాట్లతో పెవిలియన్ చేరుతున్న రిషబ్ పంత్ పై కూడా వేటువేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారట.
రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలను బూమ్రాకి అప్పగించనున్నట్లు సమాచారం. ప్రాక్టీస్ సెషన్ లో బూమ్రాతో భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్ట్ లో భారత జట్టు పగ్గాలు భూమ్రా చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ జుట్టుకు దూరమైతే అతడి స్థానంలో గిల్ తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు భారత యువ పేసర్ ఆకాష్ దీప్ నడుం నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతడు ఐదవ టెస్ట్ కి దూరం కావడంతో.. అతడి స్థానంలో కర్ణాటక స్పీడ్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ ని జట్టులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఈ సిరీస్ కి ముందు ఆస్ట్రేలియా – ఏ తో జరిగిన అనధికారిక టెస్టుల్లో ప్రసిద్ద్ కృష్ణ తన అద్భుతమైన ప్రదర్శనతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
Also Read: Irfan Pathan: రెండుగా చీలిన టీమిండియా… డ్రెస్సింగ్ రూమ్ విషయాలు లీక్..?
మరోవైపు వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో దృవ్ జురెల్ ని తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఐదవ టెస్టుకి వరునుడు అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఓ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా గా ముగిసింది. ఇక కీలకమైన ఈ ఐదవ టెస్ట్ కి కూడా వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉండడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలపై ప్రభావం పడుతుంది.